పుట:Bobbili yuddam natakam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 18

రాజు. - మేము బొబ్బిలిమీఁదికి లడాయికి వెళ్లుచున్నారము. రాయనింగారు మాతో కలసికొందురా?

నీలాద్రి. -

              క. తోడల్లునిమీఁదికి బో
                  రాడన్ రమ్మనెదవె యుచితానుచితంబుల్
                  సూడవు, ముదుకవు, పండిన
                  మేడి ఫలంబవు, సువస్త్వమిత్త్రుఁడ, వెపుడున్. ౧౪

రాజు. - నీ పాటియుచితజ్ఞత మాకు లేదందువా ? కానీ, బొబ్బిలి కొట్టి వచ్చి సామర్లకోటను దుమ్ముదుమారము చేసెదము.
నీలాద్రి. -

                 ఆయువుమీఁదను నాసలు గొంటే, నాలకింపు రాజా;
                 రాయనిమీఁదికి వెళ్లినవారికి రాక మ ఱెక్కడిది ?
                 నీటిబొట్టుకై వానకోయిల నిగిడి మొగులుఁ బొడువ;
                 మేటిపిడుగు భస్మీకరించుటే సాటి నీకు రాజా. ౧౫

రాజు. - [ఱిచ్చవడి ఆలోచించి స్వగతము] హా ! రంగారాయని శౌర్యమున నితని కెంత నమ్మకము! కానీ! ఇటు చెప్పి వంచించెదను. [మందహాసముతో, ప్రకాశము] రాయనింగారితో వేళాకోళముగా పలికితిమి. బొబ్బిలిమీఁదికి పోవుట గీవుట అంతయు వట్టిమాట సుమా!

నీలాద్రి. - కాక నిజమా? కాదని మా కప్పుడే తెలియును.

రాజు. - [హైదరుతో, అపవారించి] ఇతనికి బొబ్బిలి ముట్టడిమాట తెలియ నీకుము. ఇతఁడే ప్రస్తావించినచో మామాట వట్టివేళాకోళ మని పలుకుము. సలాము.

హైదరు. - అది కూడాను మాకీ చెప్పవాలా? సలాం. మా ఫిరంగియగాదే మేము తల్లినా మని మీకీ తెల్పుతుంది. [అని నీలాద్రిరాయనితో నిష్క్రమించును.

రాజు. - ఇతఁడిట నాకంటఁ బడుట మేలే అయినది. అప్పన్నా, మన దండును క్షణములో తరలింపుము.

అప్పన్న. - ఏలినవారి చిత్తము.

రాజు. - [పరిక్రమించుచు] అబ్బా; ఊడినట్లేరా నా ప్రక్కలోని బల్లెము! వచ్చినట్లేరా నాకంటిలోని నలుసు! అయినను ఆదిలో అపశకునము. అంతములో ఈ