పుట:Bobbili yuddam natakam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 15

                   వీరబొబ్బిలి మీకుమార్ హానందానికి
                        ఖరార్, ఖరార్, ఖరార్.
                   రాజు - [తనయుంగర మొకటి చూపి]

              సీ. డిల్లీశు నల్లా యుడీను రణస్తంభ
                        పురినుండి హస్తినాపురము దాఁకఁ
                   బఱపి, యాసుల్తాను పగిడీని గొనివచ్చి
                        పదపీఠమునఁ బెట్టి ప్రణతుఁ డైన
                   మాపూర్వునికిఁ జాహమాన హమ్మీర పృ
                        థ్వీనాయకుఁడు తనవ్రేలినుండి
                   వ్రేలఁ బెట్టిన యంగురీయకం బిది, హరి
                        యవతారములవెల్గు ; నందు నడిమి

              తే. యింద్రనీలంపు శ్రీరామ చంద్రమూర్తి
                        యెఱుఁగ, బొబ్బిలి మాకు నీ విచ్చినంత,
                   లక్షవరహాలు నీకు వైళంబుగా వి
                        రాళ మిత్తు ఖరారు, ఖరార్, ఖరారు.

హైదరు. - మరి రాండి బుస్సీధొరగారికి తయారుచేజ్దాం.

[అని ఇరువురును పోయి యథాస్థానముల కూర్చుందురు.

బుస్సీ. - ఏమి మంత్రాంగము?

హైదరు. - [బుస్సీతో అపవారించి] బొబ్బిలి కూడినట్టయితే ఈరాజాకి వర్తకులు అప్పుల్ యిస్తారంట. యేలాగయినా రంగారావుకి పైకంకోషరం కాక్పోతే మనమల్కి తుసాయించిన పొగర్ అణచడానికైనా మన్ము కొట్టవలిశిందే వుంది. అతను బేటికి రాక కారుకూతలు పలికినాడు. ఈరాజు మన్కీ లోబడి బేటికివచ్చినవాడు. ఇతనికి పెద్దరాణ్వా వుంది. పదిరొండు మన్నె గాళ్లు డబ్భైరొండు పాళెగాళ్లు ఇతని కింద లడాయిచేస్తారు. పైగా ఇతడ్కీ గొప్ప రాతికోటవుంది. ఇతణ్ని ఇక్డ పట్టినా, అంతటితో ఈపనితీరదు. ఇతనియన్నకొమారుడు ఆనందరాజు, విజయనగరంకోటలో హాయిగా వున్నాడు. అతడ్కి వేరే పట్టవాలా వుంటుంది. బొబ్బిలివారిది మట్టికోట, దానికి మట్టితో కలపడం సులువు. ఇతనితో లడాయి పెట్టుకుంటే మనకే జయం నిక్ష