ప్రథమాంకము. 7
హైదరు. - మహారాజావారు మంతిరి సామంతుల్తోకూడా డేరా లోపల్కి రావచ్చును, బూసీదొరగారు కచేహరియై యున్నారు. (అందఱును పరిక్రమింతురు.
[అంతట బూసీ యథానిర్దిష్టముగా ప్రవేశించును.]
హైదరు._వారే బూసీ ధొరగారు.
రాజు,_సలాము బూసీగారికి; సలాము వారిసర్దారులకు
[బూసీ ప్రభృతులు లేతురు.]
బూసీ_[టోపీ యెత్తి] సలాము మహారాజాగారికి,
సర్దారులు_సలాం మహారాజాగారికి.
సామంతులు_సలాము మూసాబూసీగారికిని వారి సర్దారులకు,
బూసీప్రభృతుల-సలాము మహారాజాగారి సర్దారులకు.
[రాజుకనుసన్నను పరివారజనులు బూసీ యెదుట నజరు లుంతురు: వానిని బూసీ పరికించును.]
హైదరు_మహరాజాగారు వారి సర్దార్లు అందరూ కూర్చండవాలా.
[అందఱును కూర్చుందురు.
రాజు-[బుస్సీతో] తమ సర్దారుల నామధేయ విక్రమాదికముల వినం గుతూహలపడుచున్నాను.
బుస్సీ-మన్నె సుల్తానువారికి మన సర్ధారులను తెలుపుము హైదరుజంగు బహద్దర్.
హైదరు - [ఒక్కొక్క_రిని నిర్దేశించి చూపించుచు] వీరు సిద్దీబిలాల్, కల్బర్గీ కొట్టినవారు. వీరు మూసేపనాల్, మరాటిభూములకి హతాహతం చేసినవారు. వీరు హుసేన్‌ఖాన్, ఆర్కాటికి కొట్టినవారు. మఱి వీరంతా ఏద్పడితే అదీ కొట్టినవారు.
బూసీ-మన్నెసుల్తానుగారి సర్దారులను ఒకరొకరినిగా మేము తెలిసికోవలయును.
[రాజు మంత్రివైపు చూచును.]
మంత్రి- [ఒక్కొక్కరిని సిర్దేశించుచు] వీరు గొలగొండ యెఱ్ఱభూపతిగారు; వీరు కిమిడి నారాయణదేవుగారు? వీరు అట్రగడ్డ హరిశ్చంద్రుఁడు గారు; వీరుమాడుగుల లింగారావుగారు; వీరు వంకమీసపు భూపతిరాజుగారు;
బుస్సీ.- మఱి మనము కూడిన పని జరిగింతమా ?
రాజు,-ఈపహరాలు దాఁటి తమ దర్శనము చేసికొనునప్పటికే మా సని మోడి యెత్తుట యైనది. ఇకను మాభాగ్య మెట్లున్నదో ? మా యేలినవారు గోల