బొబ్బిలియుద్ధనాటకము. 104
బాలుడు. - మహాప్లసాదము. [అని సలాము చేసి పోయి కూర్చుండును.]
[నైజాముకనుసన్న చేత దివాను నీలాద్రిరావునకు పన్నీరు చల్లును.]
నీలాద్రి. - మహాప్రసాదము, మహాప్రసాదము !
నైజాము. - ఆదాదియు వీరులలో గణన కెక్కినది. ఈబాలుని కిది తల్లికన్న ఎక్కువ. బాలునిం గాపాడినందున మాకు చాల మెహనత్తు చేసినది.
[అని హసేనాలీకి కనుసన్న చేయును. హసేనాలి దాదికి పన్నీరు చల్లును.]
దాది. - మహాప్రసాదము, మహాప్రసాదము !
నైజాము. - నీలాద్రిరావుగారూ. మీకోరిక తీఱినదా ? ఇంక నే మయినం జేయవలయునా ?
నీలాద్రి. -
ఉ. వేంకటరాయనిన్ నిసుఁగు వే కయికొంటిరి తల్లి దండ్రులై ;
యంకిలి యైన ద్రోహి తెగటాఱెను ; వీరులు పద్మనాయకుల్
బొంకరు కొంక రార్తులను బ్రోతు రటం చెద మెచ్చు కొంటిరే,
యింకను నేమి గోరుదు నహీనశయాన సమాన తెల్పుఁడా. ౮౫
(భరతవాక్యము.)
శా. సర్వజ్ఞాంకిత సింహరా ట్ప్రభవ వంశ ప్రాజ్య ముక్తామణుల్
గర్వోన్నద్ధ సపత్న భూమిధర పక్ష క్షోద నాఖండలుల్
ఉర్విం బ్రోతురు గాత శేషఫణిబాహు ల్ని చ్చలుం బోషితాం
తర్వాణీంద్రులు పద్మ నాయకులు పద్మానాయకప్రాభవుల్. ౮౬
[అందఱు నిష్క్రమింతురు.]
బొబ్బిలియుద్ధనాటకము సమాప్తము.
____________