పుట:Bobbili yuddam natakam.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 102

నైజాము. - నీలాద్రిరావుగారూ, మాకు బుస్సీగారివలన బొబ్బిలి వృత్తాంతమెల్ల తెలిసియున్నది. మీరు వచ్చినపని సంగ్రహముగా చెప్పుకొండి.

నీలాద్రి. - అ టయిన మాపిర్యాదు కరము అంక్షిప్త మైనది. ధర్మరక్షకా, హైదరుజంగు చేసిన ద్రోహమువలన బొబ్బిలిగడ్డలో మిగిలిన మగపురుగు ఈశిశువు ఒక్కఁడే ! స్త్రీలలో వీనిం బాయని యీదాదియొక్క తె మిగిలినది. వీని నోటిముందఱ, సర్కారు పెట్టిన యన్నమును, బొబ్బిలి జమీనును, విజయనగరము దొర ఆనందరాజు అపహరించినాఁడు. ఈబాలుఁడు, హుజూరునకు, వంశక్రమాగతుఁడు, గులాము; వీనికి అన్నము పెట్టుము భూలోక దేవేంద్రా.

నైజాము. - బాలుని రక్షించెదము. ఆదుష్టుని హైదరును దండించినారము. లెండు కూర్చుండుఁడు. [నీలాద్రిరావును బాలుఁడును లేచి కూర్చుందురు.]

నైజాము. - [సభ్యుల నుద్దేశించి] నిన్న వానిపైఁ గలిగిన యాగ్రహములో మిమ్ము అడుగలేదు ; ఇపుడు, చెప్పుఁడు : వానికి విధించిన దండన రాజధర్మసముచిత మా గాదా?

వజీరు. - బందగానె ఆలీ, అంతకన్న నాయ మయిన దండన యుండునా; బొబ్బిలి మహావీరులను హుజూరువారి రాణువను నాశము చేసినందులకు వానికి ఉరి దండన. వాఁడు లంచము గొని, సర్కారు పైకము పోఁగొట్టినందులకు ఇప్పటివఱకు వాఁడు లంచాలచేత చేర్చిన లక్షోపలక్షల ధన మెల్ల సర్కారు ఖజానాకు దాఖలు. మఱి విశేషము. వాని కుటుంబమునకు, యావజ్జీవము, జీవనాంశము. ఇంతకన్నను ధర్మ ముండునా ?

నైజాము. - విజయరామరాజుమీఁదికి కత్తి దూసిన బాలుఁడు ఇతడే ?

బుస్సీ. - ఔను సర్కార్ ;

నైజాము. - ఏమి బాలకా, అట్లు చేసితివా ?

బాలుఁడు. - మాబాబును చంపించిన వాన్ని నేను కొత్తొద్దా ?

నైజాము, వజీరులు. - [హర్షముతో] అరేరే ! అరరే !

నైజాము. - మఱికొట్టితివా ?

బాలుఁడు. - ఈ బూచీదొర అద్దపద్దాడు అందుకోసం కొత్తలేదు.

నైజాము. - ఆయనపెద్దవాఁడే, నిన్నుపొడిచి చంపిన నీవేమి చేయుదువు ?

బాలుఁడు. - చావంతే భయమా ? చావుకి భయపద కూదదని మావాల్లందఱు చెప్తారు. చంపేస్తే మాబాబయ్యకాడికే వెల్తాను, అది నాకు యిష్టమే గదా !

అందఱు. - అరరే ! అరరే ! బాపురే బాలకా!