పుట:Bobbili yuddam natakam.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 100

రాను. అక్డ పాపయ్య ఇంకా పొడుచుకొన్నాడో బతికేవున్నాడో? ఈతూరి ఆయన నామెడ్కాయకి నులిమితే, నేను బత్కడం అబ్ధం.

బుస్సీ. - అ టయిన నేను మాత్రమే పోయి చూచివచ్చెదను. [అని నిష్క్ర.]

హైదరు. - అబ్బా ; మెడ పడిపోయిందిరా, నాయెడ్మభాఘం, అంతాచితికి పోయింది. [అని మెల్లగా కష్టముతో లేచి] ఇప్పట్కీ నాకీ పానం దక్కింది, లక్ష వర్హాలు మునిగి పోయినయి. [అని నొప్పి నభినయించుచు, కుంటుచు నుండును.]

బుస్సీ. - [ప్రవేశించి] హాహాహా ! ఏమి ఘోర వధ !


           శా. వేలున్ లక్షలు మాంసరాసులు నభోవిస్తార మౌవిస్తరిన్
               గ్రాలన్, భుక్తికిఁ గూరుచుండి, మును శర్వథ్యాన మం దున్న బే
               తాలుండో యన, రాజమాంసఖల సక్త ప్రేక్ష బద్ధాసనా
               భీలుం, డాత్మహతుండు పాపయ యుఱున్ వీక్షింపఁగా వ్రేఁకమై.

               [నేపథ్యమున కలకలధ్వని - ఓంభాయి, ఓంభాయి, ఓంభాయి]

బుస్సీ. - ఇది, ఓహో - ఆనందరాజు పట్టాభిషేకముకై వచ్చుచున్న కలకలము గావలయును. హైదర్, మనము పోయి ఈతనివలన మనకు రావలసిన ఫేష్కస్సుల నిక్కడనే పుచ్చుకొందము. ఈతఁడు మరల విజయనగరముకోట చేరెనా, మనకు పైకము ముట్టదు.

హైదరు. - ఆలాగే చేజ్దాం. [స్వగతము] ఈగంధర్గోళంలో నా లక్ష ముణిగిపోయింది. [అని అందఱు నిష్క్రమింతురు.]

నవమాంకము సమాప్తము.

____________