Jump to content

పుట:Bobbili yuddam natakam.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 98

పెట్టితిని. ఏమి ! వెళ్లి రా? ఏ మేని దురాలోచన గలదా మీకు ? అటయిన నిలువుఁడు. మిమ్ము రూపుమాపెదను. [అని నఱకఁబోవును. దండు పలాయిత మగును.]

పాపయ్య. - మఱి యెట్లయ్యా నా డప్పి తీఱుట ? ఆహైదరుగానిం జీల్చి వాని రక్తమును కనులం జూచిననేగాని తీరదే ! వానిం గనుట యెట్లు ! [అని యరయుచుండును.]

ఒక సిపాయి. - [ప్రవేశించి, పాపయ్యం గనకయే వడిగా బుస్సీ హైదరులకడకు బోయి] - సలాం బూసీదొరవారికి.]

[పాపయ్య వినుట నభినయించును.]

సిపాయి. - సలాం హైదర్జంగు బహద్దరువారికి. ఆఫిరంగుల్ రాజా మన్మీదికి కాల్చుచేశినవి గావు. తాండ్రపాపారా వంట, దొర అంట ; ఆయనకీ కింద దళవాయంట, మిరాల సీతన్నంట. ఆయన మీకీ రప్పించడానికి వాటికి కాల్చినా డంట. పగల్డేవు చెయ్యడానికి వెల్లిన రాజాదండూకి నాలుగువందలమందికి సంపి 'వఖరిశాత సావటానికి ఖారణం ఏమి?' అని పొడుచుకొని సచ్చినాడు ఇప్పుడే. -

పాపయ్య. - [స్వగతము] బళి ! సీతన్న నాకన్న ముందే పోయినాఁడు. ఆహా ! హైదరు ఇక్కడనే దొరకినాఁడు ! బుస్సీ యున్నాఁడు బళి బళీ ! [ప్రకాశము] ఓహో ! బుస్సీదొరగారూ ! ఇక్కడికే వచ్చినారా ! వీరే గదా హైదర్జంగు గారు దూదేకులవీరులు.

బుస్సీ. - సలాం పాపాయనివారికి. [హైదరు బుస్సీవెనుక కేఁగును.]

పాపయ్య. - [తటాలున సింహము దుమికినట్లు హైదరుమీఁది కరిగి మెడను ఎడమచేతం బట్టుకొని ఇవలికి ఈడ్చుకొని వచ్చి] రారా దూదేకులవాఁడా ? నిన్ను ఏకెదను. నీవేగదా నౌభత్తు మాన్పు మన్నవాఁడవు, కోట వదలి పొమ్మన్నవాఁడవు. నీపద్దు సాధించితివే ! ఓరీ,


           శా. నీవేబొబ్బిలికోట వౌదువు సుమీ ; నీప్రాణమే రాయఁడౌ ;
                నీ వి ప్డుక్కిరి బిక్కిరిం బడుడు గుండె ల్గొట్టుకొ న్శబ్దమే
                తా వాద్యోత్తమ మైన నౌబ తగు ; హైదర్జంగ, యీబాకునన్
                నీవాద్యంబును జీల్చెదన్ : వెలి కిదే నీరాయనిం దోలెదన్. ౮౩

[బాకెత్తి] తలఁచుకో నీసామిని !

హైదరు. - నీవే నా సామివి ! శరణు శరణు మహరాజ్ ; రచ్చించు రచ్చించు; సామీ రచ్చించు.