పుట:Bobbili yuddam natakam.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 96


           సీ. రాజనంబులరాశి భోజనార్థఁబుగాఁ
                    దంచుకైవడి వీని దంచినాఁడ,
               పనసకాయను దోరపదనఁ గూరగ వండఁ
                    జెక్కుకైవడి వీని జెక్కినాఁడ,
               పొట్లకాయను దియ్యఁబులుసు దప్పళముకై
                    తఱుగుకైవడి వీనిఁ దఱిగినాఁడ,
               అంటుమామిడిపండు నారగింపునకుఁగాఁ
                    గోయుకైవడి వీనిఁ గోసినాడ,

           తే. యాతనల మ్రగ్గు మని వీని యమునియిల్లు
                    నేర్చితిని ; వీని కిఁక నేమి నేయఁ గలదు ?
               ఇంతచేఁతయు నా చేతి కించుకేని
                     యాఁటదాయె నిఁకేమి నా కాట గలదు ? ౮౦

[అని ఆలోచించుట నభినయించుచుండును.]

బుస్సీ. - హైదర్సాహేబ్, మన మొకటి అనుకొని వచ్చిన, ఇది మఱి యొకటి అయినది. ఇతనిమాటవలననే ఇతఁడు తాండ్రపాపయ్య యని తెలిసినది. ఇతఁడు రాజు వర్ణించినంతకన్న హెచ్చువాఁడుగానే యున్నాఁడు. రాజు చచ్చినాఁడు.


           ఉ. స్తంభమునుండి పై కుఱికి దానవుఁ జీలిచి రొప్పుచున్న యా
               దంభ మృగాధినాధుని విధంబునఁ బేర్చెడి దుర్ని రీక్ష్యుడై,
               కుంభిని నేర్చు రుద్రుని విఘూర్ణన తాండవ చండ సంభ్రమా
               రంభము నూని చూడ్కికి భరం బగునీతఁడు మర్త్యమాత్రుఁడే!

ఇప్పు డీమహావీరుని ఎంతటివాఁ డైనను ఎంద ఱయినను సమీపించు టెట్లు ?

హైదరు. - మాట్లాడకండీ ; ఇనబడితే మనమీదికే వస్తాడు.

పాపయ్య. - నాచేత వీని విజయనగరము కోట నా బొబ్బిలికోటలాగున నేలమట్ట మై, వీని జను లెల్ల మ్రంది, సంజీవిచేత రామసైన్యముంబోలె ఎట్లో మాజనులు మాత్రము అందఱును బ్రదికి, రంగారావు యథాపూర్వము బొబ్బిలిలోను, చినవేంకటరావు యువరాజుగా విజయనగరములో క్రొత్తకోట కట్టించుకొని అందులోను, ఈ