పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 బిల్వమంగళ [అం 5

బిల్వ - లేదులేదు-దగ్గర రా!

గోపా - పాపము! వారము రోజులనుండి నీటిచుక్కైన తాగలేదు, ఇవిగో పాలు, ఎండలో నున్నావు, నీడకు రా.

బిల్వ - నాకు కనబడదు, నాచెయ్యి పట్టుకో.

గోపా - రా. (చేతి నందిచ్చును)

బిల్వ - (గట్టిగా పట్టుకొని) ఇక నిన్ను విడువను-ఇన్నాళ్ళూ నన్ను మరపించినావు.

గోపా - నాచెయ్యి నొప్పి పెట్టుతూన్నది! వదలు. (పారిపోవును)

              బిల్వ - మరపించి పోవుట ♦ మానుషంబే నీకు?
                                 ఏడ్పింతు దయచూడ ♦ కిదియేటి మాద్రి?
                       తప్పించుకొనిపోవ ♦ గొప్పయని యెంచితో?
                                 నాదుహృదయంబునను ♦ నాదుకొను భక్తి
                       పోగొట్టయత్నించు ♦ పొగడుదు నిన్ను. నా
                                 చేయివీడిననేమి? ♦ చేతమిదెనిన్ను
                       గట్టిగాబంధించె ♦ పట్టు సడలబోదు
                                 కన్నులేమిని నిన్ను ♦ గందు ననజాల.
                       మనమున నిల్పి నే ♦ మననంబు చేతును,
                                 ఉండునో నీరూప ♦ మూడునో గాంతు.

గోపా - కో! ఏదీ నన్ను ముట్టుకో-(చుట్టూ తిప్పును)

బిల్వ - మహాత్మా! నిన్ను ముట్టుకొనడాని కెంత పుణ్యముచేసి యుండవలెను. నీవుకృపజూడకున్న నాబోటివారి