పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 బిళ్వమంగళ [అం 3

రేమిచ్చినా తింటుంది. అందరూ మంచివారనే యెంచుతూంది. (చింతామణి వచ్చును)

చింతా - సూర్యు డస్తమించినాడు, మరల రాత్రి అయింది; ధనలుబ్ధు లెవరైనా నన్ను చంపితే నా కిహమూ పరమూ కూడా చెడుతవి-మనమా, ధనము నార్జించడమునకే కదా లోకుల మానసములందు వ్యధ పట్టిస్తూన్నావు, అట్టి వారు నిద్రకి సెల వివ్వవలెనుకదా?...బిల్వమంగళుడున్నంత కాలము ఈయూహతోపనే లేదు..అయ్యో! మానసమా అతనిప్రేమ నొకనాడైనా రుచి చూచినావా? హీనమగు వేశ్య మానస మవు-నీతల్లి నిన్నిందు ప్రవేశింపచేసింది-ఈ జన్మ మధ్యాన నీవా డనదగినవా డొక్కడైనా ఘటించినాడా? ఏ రూపౌద్ధత్యము బిల్వమంగళుని మర్మముల భేదింపగల్గెనో ఆరూపమే ప్రకృతమున నీకు అమితాపకారి యైంది. ఎందరి నెంతక్షోభపెట్టి యుంటివో ఆలోచించుకో. నిరాశ్రయివగు నీవక్క్షమున ఎవరైనా కత్తితో పొడుస్తే ఏమిచేయగలవు? తుదకు నీగతి యింతకు వచ్చిందా? నీకు మృత్యువు తప్పదని ఎప్పుడైనా భావించినావా? అట్టి దిన మెప్పుడు వచ్చునో ఇప్పుడైనా ఎరుగుదువా? నీ కెవరు దిక్కు? ఎక్కడికి పోయెదవు? మహాపాతకివైన ని న్నుద్ధరించువా రెవరు?...పోతాను... బిల్వమంగళుని దగ్గరకే పోతాను! అతడు సాధుసంపన్నుడు, నన్ను నిరసించడు...నా కాముష్మికసుఖోపాయము తప్పక ఎరిగించువాడు... నే నొంటిగా... అబలను....ఎట్లు? పోగలను?