పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 49

అప్పుడే సుఖము చేకూరుతుంది. నాకు నచ్చినవాళ్ళందరినీ అరచేతిలో నుంచుకొన్నాను. సుఖపడవలెనని నా నుదుట వ్రాస్తే అట్లే ఉండి యుందును. ఇక నట్టివాడు సమకూరడు. రాణినై ఉండవలసిన దానను రట్టుపా లైనాను, వేశ్యనై వెగటుపుట్టించినాను. ఇంక నన్నట్లు మన్నించువా రుండరు.

దాసి - ఎవరూ లేరనకు. అందరికీ ఆహరియే గతి-పరితాప పడకు.

చింతా - ఆ పరమాత్మ నావంటి నిర్భాగ్యురాలిపై కృపవహించునా? అతడు దయానిధి అనీ ప్రేమసముద్రుడనీ ప్రతీతి, నేను ప్రేమరహితనైన వేశ్యను. నే నెవరినీ ప్రేమించక పోవుటచేత ఒకవేళ నన్నాతడు దయతో చూచినా అది నేను గ్రహించలేను. నాహృదయము ప్రేమశూన్యము...చూడు... నేను మునుపటిలా గున్నానా?... కాలినబొగ్గులాగు కనబడ లేదా? నాకోర్కెలన్నీ నీట కలిసినవి-ఎందరినో మోసగించినాను, అందుకు ప్రతీకార ముండదా? ఇప్పుడు నావంతు వచ్చింది!.. కాని బిల్వమంగళుని నేను వంచించినట్లు నన్నాతడు వంచించలేదు. అతడు నేనే సర్వమని భావిస్తూంటే నే నాతని పాలిటికి కాలసర్ప మైనాను. అతడు ప్రేమార్ద్రహృదయు డవడముచేత భగవత్కృపాపాత్రుడు కాగల్గెను; నా హృదయమో శుష్కమరుభూమి... ఇందు ప్రేమాసారము కల్గబోదు!

దాసి - ఆ! పుట్టి మున్గిం దంటూన్నావు! ఒకడుపోతే