పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48 బిల్వమంగళ [అం 3

అక్కడలేడు-మనుష్యులు విరాగు లవుతా రంటారు. ఆత డాలాగయ్యెనేమో?

దాసి - అట్టివాడు విరాగి కావడ మేలాగు? ఇటువంటివారిని చాలామందిని నేను చూచినాను. సన్యాస మేమి సామాన్య మనుకొంటివా? ఈసుద్దులు నావద్ద కట్టిపెట్టు.

చింతా - నేటికి నాకళ్ళు విడ్డవి. వలపన్న వట్టి భ్రాంతి అని లోగడ తలుస్తూ ఉంటిని, కాని ఇప్పుడు నిజము తేలింది. వలపు నిజమే! ఒక్కనాడేనా అతనితో మంచిమాట ఆడినానా? ఆతడు పిలువగానే కోపమువచ్చి తలుపువేసి పడక గదిలో పరుంటిని. రాత్రి అంతా ఆతడు మేడపై నుండెను. నాకు నిద్రాభంగ మవుతుందనే భయముచేత రాత్రి ఒకమారేనా నన్ను పిలువలేదు... నాకంటినుండి రెండు నీటి చుక్కలు జారితే అతడు బాష్పవృష్టి కలిగించేవాడు! అతడు నన్ను బతిమాలినకొద్దీ బెట్టుచేసి కాలితో తన్నుతూంటిని.. దానికి తగినశాస్తి నా కిప్పు డయింది.

దాసి - ఈప్రపంచములో ఎవరికి వారేకాని ఒకరి కొకరు కారు. ఆకలిబాధ భరించ నలవికాదు! కోటివేషాలూ కూటికొరకే! పురుషులు అద్దాలవంటివారు, మనము నవ్వితే వాళ్లూ నవ్వుతారు. మనమేడిస్తే వాళ్ళూ ఏడుస్తారు ! పాడుపొట్టకోసము పరులను ఆశ్రయించాలి. చేరువ కొచ్చిన వారిని చేత చిక్కించుకోవలెను.

చింతా - అట్లుచేర్చినవారు మనవారు కావద్దా