పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిల్వమంగళ 23

బిగియార కౌగలించి ఏడ్చి నిష్ఠురము లాడదా? చింతామణి నాది, నేను దానివాడిని. నాప్రాణములు నావికావు - చింతామణివి. దానికి నాపై నెంతప్రీతి! ... ఏమి చేయడానికీ తోచదు, ఏరు దాటడ మేలాగు? ప్రవాహ మతితీవ్రముగా నుంది. ఈశ్మశానములో ఏదైన దుంగ దొరకదా? (ముందునడిచి పిచ్చిదానిని చూచి) ఇదేమి భూతమా, పిశాచమా?.. పిశాచమే! శవములను కాల్చుకొనితింటూన్నది. దీనిమనస్సు కరిగితే న న్నావలియొడ్డు చేర్చగలదు. నేను బ్రతికియున్నా నాప్రాణములు కుదుట లేవు. దీనిచేతిలోపడితే చావుతప్పదు. కానీ, పల్కరించి చూస్తాను...ఓసీ! నిన్ను షోడశోపచారములతోను ఆరాధిస్తాను, అద్దరిని నన్ను చేర్చగలవా? తల్లీ! దయజూపి ధర్మము కట్టుకో - చింతామణికై నాచిత్తము తత్తర పడుతూన్నది.

               పిచ్చి - ఏది ఏది చింతామణి? ఎక్కడికి నేగినది?
                        మెడనున్న మణిహారము వెడగువోలె కాటనుంటి,
               ఆమె యెచటి కేగినదో? అద్రిగుహల జేరినదా?
                        అడవిలోని కేగినదా? అక్కడనే నిల్చినదా?
               ఏడ నాకు దోచదాయె ఏల బ్రతుకునాస యింక?
                       దేశదేశములను తిరిగి దేహమెల్ల బూదియలిమి,
               కడుపుమంట నార్పగాను కడువడిపడుచుంటి నేను;
               పిడుగువడగ నురముచాచి చిడిముడి హృదయమున దోచి,
               అన్ని చోటులను జూచి అన్ని దు:ఖముల దాచి,