పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122 బిల్వమంగళ [అం 5

చింతా - హృదయమందలి దప్పి తీరునట్లు కృష్ణదర్శన సుధా రసముగ్రోలుడు. భక్తులారా! - భాగవతోత్తములారా! జన్మ సార్థక మవును.

శిష్యు - గురువర్యా! శ్రీకృష్ణ దర్శనమునకు ఫలము శ్రీ కృష్ణదర్శనమేకదా!

సోమ - వత్సా, నిరతిశయానంద వైభవము నొసంగ జాలున దింకోటి లేదు-దాని ననుభవించుటే ఉత్కృష్ట ఫలము.

బిచ్చ - నవనీతచోరా, నిన్ను దొంగిలించగల్గితే నా చౌర్యవిద్య సార్థక మవుతుంది.

పిచ్చి - నా కేడ్పు వస్తూన్నది. నానాధుడు లేడు, నే నొక్కర్తె నైనాను. అతని వెతకి తెచ్చి శ్రీ కృష్ణుని చూపుతాను.

సోమ - అమ్మా ! మనకర్మ ఇంకా పరిపక్వము కా లేదు. కొంతవరకూ పారబ్ధ మనుభవించవలెను. పోదాముపద.

బిల్వ - శ్రీ గురుచరణాల విందములకు నమస్కారము! భక్త బృందమునకు ప్రణామము! మీయందరికృపచేత గోపీ వల్లభుని దర్శనము ప్రాప్తించినది, తరించినాను.

                       స:నా వవతు, స: నౌభునక్తు, సహవీర్యం కరవావహై,
                       తేజస్వినా వధీత మస్తు-మా విద్విషావహై-
                                    ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:.

సమాప్తము.