పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 121

                        తరింపన్ - కోర్కె కలదేనిన్ - తలపుమీ - కృష్ణునామాళిన్!
                        నిరంతర - మాతనిన్ - కరుణానిరతునిన్ - నిల్పుమా మదిని||త||
                        మదింపకు భాగ్యమున్ ధనమున్ ఘనంబౌ - మానముం జూచి
                        ఎదంగని న్యాయనిర్ణేత పరాత్పరు-డేలు నిన్నంచున్||త||
                        శరీర దుర్గమం దకటా చరింతురు-శత్రులారుగురు
                        --కును మాని భవవార్ధిన్ గడుపుమా-భక్తియను నౌకన్||

చింతా - యోగివరా ! నీవు కృష్ణుని జూపుదువని నా గురు వుపదేశించెను, ఏడీ చూపు మాకృష్ణుని-లేకున్న ఆప్త వాక్య మబద్ధమవును!

(తెఱలో) నన్ను మరచినారా?

చింతా - చూచినానా నిన్ను ? ఆగోపాలుడే నన్ను ప్రేమించెను. నేను ప్రేమశూన్యను. గోపాలా - ఆదదానను అజ్ఞురాలను, నాపై కోపమా ? నీకు నాపైని పంతమా? దయచేసి దర్శనమియ్యవా?

(తెఱలో) ఇక్కడికి రా, చూచెదవు.

(తెర ఎత్తితే రాధా కృష్ణులు ప్రత్యక్ష మవుదురు)

అందరు - జే రాధావల్లభా! జే జే రాధాకృష్ణా జే! జే! జే!

వర్త - ఆహా ! కలియుగమున వైకుంఠము!

అహ - ఏది నాయనా ఒక్కసారి "అమ్మా" అనుము.

గోపా - అమ్మా! అమ్మా!