పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118 బిల్వమంగళ [అం 5

నే నీ చెట్టుచాటునే ఉంటాను. అదిగో వస్తూన్నారు! (పోవును)

(వర్తకుడూ భార్యా వత్తురు)

వర్త - ప్రియా, ఆ గోపాలు డెవడు? బృందావనమున కృష్ణుడు లభించునని చెప్పి మాయమైనాడు!

అహ - అదేమో కాని, ఆబాలుడు న""న్నమ్మా" అని పిలుస్తునే నాకు కృష్ణు డక్కరలేదు.

(తెరలో) - అమ్మా!

అహ - నాయనా, ఎక్కడ నున్నావు? ఇటురా, ఇటు (తెరలో) - నే నీ చెట్టుచాటున నున్నాను-మీరు కూర్చోండి.

బిల్వ - ఆహా! ఎట్టి దివ్యసుందరవిగ్రహము చూచినాను! గోపాలా! గోపాలా!

(చింతామణి, పిచ్చిది, బిచ్చగాడూ వత్తురు)

పిచ్చి - నీవు ముందరపో అమ్మా! అల్లుని యెదుటకి నే నేలాగు రావడము! నే నిక్కడ కూర్చుంటాను - అయ్యా నీవూ కూర్చో. ఇది పుచ్చుకో. (బంగారువస్తువు లిచ్చును.)

బిచ్చ - ఇది నా కెందు కమ్మా?

పిచ్చి - అక్కర లేదా? ఇలాగే పరులసొమ్ము ఆశించకు!

బిచ్చ - అలాగే.

(సోమగిరి శిష్యుడూ వత్తురు)

సోమ - సంసారాంబునిధీమగ్నులకు వైరాగ్యభిక్ష