పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 117

కది సాధ్యమవునా? కర్మపరిపక్వము కావలదా?

గోపా - ఇదే నీకు జ్ఞాననేత్ర మిచ్చినాను. నా రూపము కన్నార గాంచుము.

బిల్వ - ఆహా! ధన్యోస్మి! ధన్యోస్మి! చూడదగినది చూచినాను - నాతపస్సు ఫలించినది.

                      నవీనజలధర శ్యామసుందర ♦ మదనమోహనరూప
                      నయనఖంజనా హృదయరంజన ♦ రాధావల్లభ గోపా||
                      ధీరనర్తనా సూపురగుంజన ♦ మురళీమోహన తాన
                      కుసుమభూషణా ఆర్తపోషణా ♦ శరణు గోపికాప్రాణ||
                      శ్రీపదపంకజనీదు పదరజము ♦ దయజేసియు దరిజూపరా
                      నిన్నే నమ్మితి నిన్ను భజించితి ♦ నీలో నన్నిక జేర్పరా||

గోపా - ఎవరో వస్తూన్నారు. నేను దాగుకొంటాను. వారు నీకోసము వస్తూన్నట్లుంది, నీవిక్కడే ఉండు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వస్తాను.

బిల్వ - అమ్మయ్యో? నీవు వెళ్ళకు. నాకింకెవ్వరితోనూ సంబంధము లేదు.

గోపా - ఏమోకాని వాళ్ళేడుస్తూ వస్తూన్నారు. వారిని చూస్తే నాకూ ఏడ్పు వస్తుంది. అందుకే నే నిక్కడుండను.

బిల్వ - ఆహా! నీకేడుపు తెప్పించునంతటివా ళ్ళెంత ధన్యులో!

గోపా - ఇప్పుడే తెలుస్తుంది గా! ఇక్కడే ఉండు.