పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114 బిల్వమంగళ [అం 5

మూడో రంగము

_______

(వనములో బిల్వమంగళుడు)

బిల్వ - ఈగోపాలుడు నన్ను పాడుచేసినాడు! ఎన్ని విధముల యత్నించినా మరుపు రాకున్నాడు. వీనిమోహమున తగులుకొన్న నాకు శ్రీకృష్ణదర్శనము ప్రాప్తించదు. ఈ సాయంకాలము దాకా వేచి యుంటాను. ఈలోపున చిత్తస్థైర్య మలవడిందా సరే. లేకుంటే ఆత్మహత్య కావించుకొంటాను. అన్నా! నామన:ఫలకమున ఈగోపాలు డేలాగు దాపురించినాడు? వీడే నాచేటునకు మూలకారకుడు. హా! కృష్ణా! నన్నేల మరపిస్తూన్నావు? నన్ను భ్రష్ఠుని చేసెదవేమి? ఈగోపాలుని నామానసమందు అచ్చొత్తి నీవు కనుమొరగితివా? వీడిని వదల్చుకొని నేటికి వారమయింది. కాని వానిరూపము నన్ను వదలకున్నది-అనుక్షణమూ వాడే నామనోవీధిని కాపురముండి నీకు చోటియ్యకున్నాడా ? అతడుంటే నేనెట్లు రాగలనని నీవు రాకున్నావా? నేనేమి చేయుదును? ఈభ్రష్టుడు నా కేమి మందుపెట్టి నాడో కాని నేనతని మరువజాలకున్నాను. నా చిత్త మాతనియందే లగ్నమయింది. ఇరువై రోజులు భుజించకుంటే ప్రాణములు పోవునని వింటిని-అందుచేత నిరాహారుడనై నిన్నే ధ్యానించుచున్నాను. ప్రాణములు పోకున్నవి. ఈగోపాలుడు నన్ను చావనీయకున్నాడు! నిన్ను ధ్యానిస్తూ