పుట:Bibllo Streelu new cropped.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లు తమ ప్రాణాలొడ్డి అతన్ని కాపాడారు -రోమా 16, 4. వేదజోధలో ఆ సతీపతులు పౌలుకి ఎంతగా సాయం జేశారంటే, అతడు వాళ్లను "నాతోడి పనివాళ్లు" అని పేర్కొన్నాడు. తన ప్రేషిత ప్రయాణాల్లో వారిని తన వెంట తీసికొనిపోయాడు -అ.చ. 18, 18.

అక్విలా ప్రిసిల్లా నేడు మనకు బోధించే ఆదర్మాలు ఇవి. వాళ్లు వళ్లు దాచుకోక కష్టపడి పనిచేశారు. భార్యభర్తలు అన్యోన్యం కలసిమెలసి జీవించారు. పవిత్రమైన కుటుంబ జీవితం గడిపారు. తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొన్నారు. వేదబోధ చేశారు. వారియిల్ల ప్రార్ధనా గృహమైంది. భక్త బృందానికి ఆశ్రయస్థానమైంది. వాళ్లు లౌకిక ఆధ్యాత్మిక జీవితాలను కలగలుపులుగా కలిపి భక్తిగా జీవించారు. లౌకిక జీవితం గడుపుతూ గూడ దైవసేవ చేశారు. నేడు మనం కూడ ఈ పుణ్య దంపతులను అనుకరిస్తే ఎంత బాగుంటుంది:

49. ఫీటే-అచ161-2

గ్రీకు గాథల్లో ఫీబే చంద్రదేవత. ప్రకాశించేది, దీపం అని ఫీబే పదానికి అర్థం. కెంక్రేయలో వసించిన భక్తురాలు ఫీబే గ్రీకుజాతి స్త్రీగా పుట్టిపెరిగి తర్వాత క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి వుండవచ్చు. పౌలు ఈమె ద్వారానే రోమీయుల జాబును రోముకి పంపివుంటాడని కొందరు బైబులు పండితులు అభిప్రాయపడ్డారు. కెంక్రేయ కోరింతు నగరానికి తూర్పు భాగానవున్న వోడరేవు.

పైన ఉదహరించిన ఆలోకనంలో పౌలు ఫీబేకు మూడు బిరుదాలు వాడాడు. ఆమె సోదరి, సేవకురాలు, సహాయకురాలు. ఈ మూడు పదాల భావాన్ని గ్రహిస్తే మనం ఫీబేను గూర్చి చాల సంగతులు తెలిసికొన్నట్లే.

మొదటిది, ఫీజే సోదరి. పౌలు ఆమెను "మన సోదరి" అని పేర్కొన్నాడు. మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అతనికి తమ్ముళ్లమూ చెల్లెళ్లమూ ఔతాం. అతని తండ్రికీ ద్రత్తపుత్రులం ఔతాం. కనుక క్రైస్తవ