పుట:Bibllo Streelu new cropped.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదాముకి తోడుగా అతడు తనకు తోడుగా జీవించేది. ఐనా ఆమె పిశాచం మాటలు నమ్మి దేవుని ఆజ్ఞ విూరింది. తినవద్దన్న పండు తింది. ఆదాము చేత కూడ తినిపించి అతన్ని కూడ పాపంలోకి లాగింది. ఇద్దరూ పతనమై పోయారు. ప్రభువు క్షమాపణ ఏవ పడిపోయి మళ్లా లేచింది. భార్యగా, తల్లిగా రాణించింది. మాతృత్వం ఆమెకు గొప్ప వరం. పశ్చాత్తాప పడగానే దేవుడు ఆమె తప్ప క్షమించాడు. అతడు పిశాచంతో నీకును స్త్రీకిని, నీ సంతానానికీ, స్త్రీ సంతానానికీ వైరం కలిగిస్తాను. ఆమె సంతానం నీ తలను చితకగొడుతుంది అని చెప్పాడు. ఈ సంతానం రాబోయే క్రీస్తు. అతడు సిలువ మరణం ద్వారా మన పాపాన్నీ, చావునీ తొలగించాడు. పిశాచాన్ని ఓడించాడు. ఏవకు బదులుగా రెండవ ఏవ మరియ వచ్చింది. మొదటి ఏవ దేవుని రక్షణ ప్రణాళికను భంగపరిచింది. రెండవ ఏవ మనకు రక్షణనూ, వరప్రసాదాన్నీ తీసికొని వచ్చింది. మొదటి ఏవ మన మెడకు ఉరిపెట్టి పోయింది. రెండవ ఏవ ఆ ఉరి విప్పింది. ఏవకు చాలామంది బిడ్డలు కలిగి వుంటారు. బైబులు వారిలో ముగ్గురిని మాత్రమే పేర్కొంటుంది. వాళ్ల పేర్లు కయీను, హేబెలు, షేతు. క్రీస్తు ఈ షేతు వంశంనుండే జన్మించాడు. నూత్న వేదంలో ఏవ నూత్నవేదం కొన్ని పర్యాయాలు ఏవను ఖండిస్తుంది. కొన్నిసార్లు మెచ్చుకొంటుంది. పౌలు భావాల ప్రకారం పిశాచం ఏవను శోధించి అపమార్గం పట్టించింది. ఆలాగే కపట ప్రవక్తలు కొరింతు క్రైస్తవులను మోసగించి క్రీస్తుకు దూరం చేశారు. ఈ ఉపమానంలో పౌలు ఏవను దోషినిగా పేర్కొన్నాడు- 2కొరింతి 11,3. ఏవ పిశాచం మోసానికి లొంగి అపరాధం చేసింది - 1తిమో 2,14. ఇవి ఖండన వాక్యాలు. కాని పై పౌలు భావాల ప్రకారమే పాపాన్ని మానవజాతిలోకి GD