పుట:Bibllo Streelu new cropped.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాిటియైన సహాయకురాలిని చేస్తాను అనుకొన్నాడు - 2,18. అప్పటికే జంతువులున్న అవి ఆదాము కోవకి చెందినవి కావు. కనుక ప్రభువు ఆదాముకి సాట్టేయన మానవ వ్యక్తిని పుట్టంచాడు. ఆమెను ఆదాముకి సహాయకురాలినిగా వుండఢానికి పుట్టించాడు. ఇక్కడ సహాయకురాలు అనే మాటకు హిబ్రూలో ఏచ్చేర్‌ అనే మాట వాడారు. ఆ భాషలో ఈ ఫదానికి తక్కువది అనే అర్థం లేదు. సరిసమానురాలు అనే అర్థం మాత్రమే వుంది. ఆమె అన్ని విషయాల్లోను ఆదాముకి సరిసమానం. అతనితోను దేవునితోను కూడ సంబంధం కలిగించుకోగలది. కనుక మన భారతదేశంలోని సామాన్య జనంలాగ స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అనుకోగూడదు.

ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగించబడింది. అనగా వాళ్లిద్దారిది ఒకే స్వభావం. కనుక ఆమె అతనికి బానిస కాదు. అతడు వాడుకొనే వస్తువు అసలే కాదు. ఇంకా ఆదాము ఈమె నా ఎముకల్లో ఎముక, నా శరీరంలో శరీరం అనుకొన్నాడు. దగ్గరి బంధువురాలని ఈ మాటలకు అర్థం. ఆదాము ఏవలు పరస్పర ప్రేమతో జీవించాలి. ఇద్ధర్రు కలసి ఏకవ్యక్తి అన్నంత సన్నిహితంగా బ్రతకాలి. వారి దాంపత్య ం తర్రువాతా రాబోయే నరుల సంసార జీవితానికి మాదిరిగా వుంటుంది. వివాహాన్ని లౌకిక చట్టాలు కాక భగవంతుడే నిర్ణయించాడు. అది పవిత్రవ్యవస్థ.

               ఏవ రూపం

భగవంతుని సృష్టి మంచిది, సుందరమైంది- 1,10. అతడు చేసిన ఏవ కూడ సుందరమూర్తి. ఆదాము ఆమెను చూసి సంతోషించాడు - 2,23. యూదుల టాల్మడ్‌ గ్రంథాం సారాతో పోలిస్తే ఏ స్త్రీ అయిన కోతి లాగ వికారంగా వుంటుంది. కాని ఏవకి సారాకీ మధ్య నరునికీ కోతికీ వున్నంత అంతరం వుంది అని వాకొంది.

         ఏవ పతనం

ఏవ రూపవతి. అంతకం టే అదనంగా దేవుని వరప్రసాదం కలది. 2