పుట:Bibllo Streelu new cropped.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
'మొదటి భాగం - పూర్వవేద స్త్రీలు'
  1. .దేవుని పోలిక కలిగిన ఏవ



బైబుల్లో మొట్టమొదట కనిపించే స్త్రీ ఏవ. భగవంతుడు ఆమెను ఆదాముకు తోడుగాను సహాయకురాలిగాను సృజించాడు. దేవుడు నరజాతి చరిత్రనంతటినీ ఆది దంపతుల్లో సంగ్రాహం ఇమిడ్చాడు.
ఏవకు మూడు పేర్లు:
నరజాతికి తల్లియైన ఏవకు బైబుల్లో మూడు పేర్లున్నాయి.మొదటిది స్త్రీ. హీబ్రూలో ఈష్ అంటే నరుడు. దీనికి స్త్రీలింగం ఈషా. అనగా నారి. నరునితో సంబధం కలది కనుక ఏవ నారి ఐంది- ఆది 2,23.ఈ నారికే బైబులు స్త్రీ అనే పర్యాయపదం వాడుతుంది.
ఆమె రెండవ పేరు ఆదాము. హీబ్రూలో ఈ పేరుకి నరజాతి అని అర్ధం.