పుట:Bibllo Streelu new cropped.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆజ్ఞాపించినట్లే ఏడుసార్లు ఏటిలో మునిగాడు. అతని కుష్ట మాయమైంది. నామాను ప్రవక్తకు కానుకలు అర్పింపగోరాడు గాని యెలీషా స్వీకరించలేదు. అతడు యిస్రాయేలు దేశం నుండి కొంత మట్టిని తీసికొని వచ్చి దానిమిద తన దేశంలో యావే ప్రభువుని ఆరాధించాడు. ఆ రోజుల్లో ఒక్కోదేశం ఒక్కో దేవునికి చెంది వుంటుందనీ, ఏ దేశంలో ఆదేశపు దేవుణ్ణి మాత్రమే కొలవాలనీ భావించేవాళ్లు. కనుక నామాను యిస్రాయేలు దేశాన్ని మట్టి రూపంలో సిరియాకు కొనిపోయాడు. యావే వొక్కడే దేవుడని ప్రకటించాడు - 2రాజు 5,19.

పై పనిపిల్ల పలికిన వాక్యం నామానుకు ఆరోగ్య కారణమైంది. పైగా అతనికి యావేపట్ల విశ్వాసం కలగడానికి కూడ దారిజూపింది.

ఈ పనిపిల్ల మనకు ప్రేరణం పుట్టిస్తుంది. ఆమె పరాయి దేశంలో అన్యజాతి ప్రజల మధ్య కూడ తన దేవుణ్ణి కొలవడానికి వెనుకాడలేదు. తన దేవుణ్ణి గూర్చి యజమానునికి తెలియజెప్పడానికి గూడ జంకలేదు. ఆమె వలననే నామానుకి యావే ప్రభువు పట్ల విశ్వాసం పుట్టింది. ఆమె గొప్ప వ్యక్తి ఏమి కాదు. కేవలం పనిపిల్ల. ఐనా యజమానుని పరివర్తనకు కారణమైంది. మనం ఎంత చిన్న అంతస్తులో వున్నా మన దేవుణ్ణి గూర్చి ఇతరులకు చెప్పవచ్చు. సామాన్యప్రజలు కూడ వేదబోధ చేయవచ్చు. కాని దీనికి మొదట మన హృదయంలో విశ్వాసదీపం వెలుగుతూండాలి. ఇంకా, మన క్రింద పనిజేసే వారిని మనం అట్టే గుర్తించక పోవచ్చు. కాని వారి పద్ధతిలో వాళ్లు కూడ ఇతరులకు దేవుణ్ణి గూర్చి చెప్తుంటారు. కేవలం మన సేవే గొప్పది అనుకోగూడదు. ఇతరుల సేవకు కూడ విలువనీయాలి. ఈ కథ 2 రాజు 5,1-19 లో వస్తుంది.

34. దైవ జ్ఞానంగల హుల్డా

యోషియూ భక్తిగలరాజు. అతడు యిస్రాయేలు దేశంలో సంస్కరణాలు ప్రారంభించాడు. ప్రజలను దేవుని దగ్గరికి రాబడుతున్నాడు. ఒక పర్యాయం దేవాలయంలో మరమ్మత్తులు చేస్తుండగా అక్కడ ఓ