పుట:Bibllo Streelu new cropped.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుజన్మించాడు. - మత్త 1.5. రాబోయే క్రీస్తువలన ఆదంపతులు ఆశీస్సులు పొందారు.

యూదురబ్బయులు రూతుగ్రంధాన్ని బైబుల్లో చేర్చడానికి అనేక కారణాలున్నాయి. 1. ఆ గ్రంథం దావీదు వంశావళిని తెల్పుతుంది. 2. పూర్వనాయకులైన ఎజ్రానెహెమ్యాలు అన్యజాతి స్త్రీలను పెండ్లి చేసికోవద్దన్నారు. ఈ గ్రంథం ఆ సంకుచితవాదాన్ని ఖండిస్తుంది. 3. బిడ్డలు లేని వితంతువులు దేవరన్యాయం ప్రకారం సంతానాన్ని కని కుటుంబాలను నిలబెట్టాలనే ధర్మాన్ని ఈ గ్రంథం సమర్ధిస్తుంది. రూతు రెండవపెండ్లి చేసికొంది కామతృప్తి కొరకు కాదు, సంతానం కొరకు. 4. ఈ పుస్తకం జాతులు కలసిపోవచ్చునని సూచిస్తుంది. 5. అన్నిటికంటె మిన్నగా రూతు అత్తపట్ల చూపిన ప్రేమ, స్నేహం కొనియూడ దగినవి. ఉదాత్తమైన కుటుంబధర్మాలకు ఈ గ్రంథం అద్దంపడుతుంది. రూతుకుటుంబాలను కలిపింది. ఆ కుటుంబాలను దేవునితో గూడ కలిపింది. అందుకే యూదస్త్రీలు నవోమితో కోడలు నీకు ఏడురు కుమారులపెట్టు అని పోగడారు - 4,15.

ఆ పుణ్యస్త్రీ ఉత్తమురాలైన కోడలు, భార్య, తల్లి జాతినీ మతాన్నీ కూడ దాటిపోయి అత్తపట్ల స్నేహాన్ని ప్రదర్శించిన యోగ్యురాలు. ప్రేమ కొరవడిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమౌతున్న ఆధునిక కాలంలో రూతుకథ మనకు ప్రేరణం పుట్టిస్తుంది.

15. విషాదసంతోషాలకు నెలవైన నవోమి

నవోమి అంటే మనోహరమైనది అని అర్థం. ఆమె ఎలీమెలెకు భార్య. మహాను కిల్యోనుల తల్లి. యూదయాదేశంలో కరువురాగా ఎలీమెలెకు కుటుంబం మోవాబు దేశానికి వలసపోయింది. ఆ దేశంలో భర్త చనిపోగా నవోమి చాల బాధపడింది.

కుమారులిద్దరు వెూవాబు దేశీయులైన ఓర్ఫారూతులను పెండ్లిచేసికొన్నారు. కాని మూలిగేనక్క తాటికాయ పడినట్లుగా GO