పుట:Bibllo Streelu new cropped.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొడ్రాలుగా వుండిపోయింది. ఆమె నాకు బిడ్డల నిస్తావా లేక చావ మంటావా అని యాకోబుని పీడించింది -30.1. సంతాన వాంఛ బలం కాగా తన దాసి బిల్శ్హను యాకోబుకి సమర్పించి ఆమెవలన కలిగిన బిడ్డలను తన బిడ్డలను చేసికొగొరింధి. తర్వాత దేవుడు ఆమెను గూడ కరుణించి గర్భవతిని చేశాడు. ఆమె తొలిచూలు బిడ్డడు యోసేపు. దేవుడు నాకు ఇంకో కుమారుణ్ణి దయచేయును గాక అని ఆ పేరుకి అర్ధం-30,24. భగవంతునికి కృతజ్ఞత తెల్పుతూ తల్లి అతనికి ఆ పేరు పెట్టింది.

విశ్వాసలోపం

యాకోబు మామను వీడి కుటుంబసమేతంగా కనాను దేశానికి తిరిగి వస్తున్నాడు. రా హేలు లాబాను గృహదేవతా విగ్రహాలను దొంగిలించుకొని వచ్చింది -31, 34. వాటి వలన తన ప్రయాణం క్షేమకర మౌతుందనీ, తనకుటుంబానికి సిరిసంపదలు అబ్బుతాయనీ ఆమె నమ్మకం. యాకోబు అనన్యచిత్తంతో యావే ప్రభువుని కొల్చినవాడు. కాని రాహేలుకి అన్యదైవాలమీద కూడ నమ్మకం వుంది. అది ఆమె విశ్వాసలోపం. ఆమెది ఒకవైపు బహుభార్యాత్వం, మరోవైపు బహుదేవతారాధనం. తర్వాత యాకోబు మెసపొటామియా నుండి కొని వచ్చిన విగ్రహాలనన్నిటినీ షెకెము సిందూరం క్రింద పాతి పెట్టాడు. అతడు యావే భక్తుడు-35, 4. అటుతర్వాత రాహేలు ప్రభువుని మాత్రమే సేవించి వుండాలి.

విషాద మరణం

కనాను దేశం చేరాక రాహేలుకి ఎఫ్రాత వద్ద మరో కుమారుడు కలిగాడు. కాని అక్కడ ఆమె పురుటి నొప్పులతొ మరణించింది. చనిపోతూ ఆ కుమారునికి బెనోని అని పేరుపెట్టింది. నా శోకానికి కారకుడైన కుమారుడు అని ఆ పేరుకు అర్థం. కాని యాకోబు ఆ బిడ్డణ్ణి బెన్యామిను అని పిలిచాడు. ఆ పేరుకి కూడి చేతి కుమారుడు, అనగా సహాయం చేసేవాడు అని అర్థం. యాకోబు అక్కడ తనకు ప్రీతి