పుట:Bibllo Streelu new cropped.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వొంటెలకు కూడ నీళ్లు తోడిపోసింది. సేవకుడు వాళ్లయింటికి పోయి అక్కడ విడిది చేశాడు. ఆ కుటుంబ సభ్యులకు కానుకలు సమర్పించాడు. తాను యజమానుని కుమారునికి వధువుని వెడకడానికి వచ్చానని చెప్పాడు. రిబ్కాను ఈసాకుకి భార్యగా ఈయమని అడిగాడు. తల్లిదండ్రులు సమ్మతించారు. వాళ్లు రిబ్కాను అడగగా ఆమెకూడ అనుమతించింది24,58. ఇదంతా దైవనిర్ణయం ప్రకారమే జరిగింది.

                                                                                                                                             భర్తప్రేమ    
          ఎలీయసేరు రిబ్కాను తీసికొని యజమానుని ఇంటికి బయలుదేరాడు. అక్కడ ఈసాకు సాయంకాలం పొలానికి వెళ్లాడు. ఒంటెనెక్కివస్తున్న రిబ్కా అతని కంటబడింది. వధూవరులు ఒకరినొకరు చూచుకొన్నారు-24,64-65. ఈసాకు ఆమెను తల్లి గుడారానికి తీసికొనివచ్చి పెండ్లి చేసికొన్నాడు. అతడు భార్యను గాఢంగా ప్రేమించాడు. రిబ్కా వలన తల్లి లేని లోటుతీరి తెప్పరిల్లాడు. వారిది ఆదర్శ దాంపత్యం –25,67.
                         ఇద్దరు కొడుకులు

ఈసాకు దంపతులకు సిరిసంపదలు వున్నాయి. కాని సంతానం లేదు. రిబ్కా చాలకాలం వరకు గొడ్రాలుగా వుండిపోయి దుది. ఈసాకు, భార్యతరపున దేవునికి మనవిచేయగా దేవుడు తన రక్షణప్రణాళికను నెరవేర్చుకోగోరి అతని మొర ఆలించాడు. రిబ్కా గర్భవతిఐంది -2.5,2. కాని ఆమె గర్భంలో కవలపిల్లలు వున్నారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు నెట్టుకోసాగారు. ఆమె దేవునికి మనవి చేయగా ప్రభువు నీ గర్భంలో ఇద్దరు శిశువులున్నారు. వాళ్లు రెండు మహాజాతులకు మూలపురుషులు ఔతారు. పెద్దవాడు చిన్నవాడికి ఉడిగం జేస్తాడు అని చెప్పాడు - 25,43. ఆ యిద్దరే యేసావు యాకోబులు.

ఏసావు ఏదోమియోయులకు, యాకోబు యూదులకు వంశకర్తలు. ఈ రెండు జాతులకు పరస్పర వైరం వుండేది. యాకోబు నెమ్మదిగా GED