పుట:Bibllo Streelu new cropped.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాగరుపట్ల దైవకృప

  ఆ బానిస తాను గర్భవతి నయ్యానన్న ధీమాతో యజమానురాలినే చిన్నచూపు చూచి ధిక్కరించింది. సారా ఈ అవమానాన్ని భరించలేక బానిసను తీవ్రంగా శిక్షించింది. ఇక యజమాను రాలు బానిస ఒకేయింట ఇమడలేక పోయారు. హాగరు సారాను ఎదిరించి నిలువ లేదు. కనుక ఇంటినుండి పారిపోయి ఎడారికి వెళ్లిపోయింది. అక్కడ వొక బావిదగ్గర కూర్చొని వుండగా దేవదూత ప్రత్యక్షమై యింటికి తిరిగిపోయి నీ యజమానురాలికి లొంగివుండమని ఆజ్ఞాపించాడు - 16, 9. క్రూరంగా దండించడం సారా తప్పే. కాని బానిస యింటి నుండి పారిపోవడం ఇంకా పెద్ద తప్పు. దేవదూత నీ నుండి మహాజాతి ఉద్భవిస్తుందని కూడ చెప్పాడు. ఆ వాగ్దానానికి హాగరు సంతోషించింది. ఆ బావికి “బెయేర్ లహాయి రోయి” అని పేరు పెట్టింది. నన్ను గమనిస్తున్న సజీవ దేవుని బావి అని ఆ పేరుకి అర్థం. అనగా దేవుడు ఆమె కష్టాన్ని కన్నులార చూచాడని భావం. ఇంకా దేవదూత నీకు బిడ్డడు జన్మిస్తాడు. అతనికి యిష్మాయేలని పేరుపెట్టమన్నాడు - 16,11. ఆ పేరుకి దేవుడు వింటాడు అని అర్థం. అనగా దేవుడు హాగరు మొర వింటాడని భావం. ప్రభువు దయామయుడు. హాగరు కష్టాన్నికంటితో చూచేవాడు. ఆమె యేడ్పులను చెవితో వినేవాడు. హాగరు దైవ కృపకు పాత్రురాలయింది. ఆమె ప్రభువుని పూర్ణంగా నమ్మింది. కష్ట కాలంలో దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకొంది.
             దేవుడు హాగరు గోడు వినడం
   హాగరు ఎడారినుండి యింటికి వచ్చి బిడ్డణ్ణి కంది. ఆ శిశువుని చూచి ఆనందించింది. అప్పుడు అబ్రాహాము వయస్సు 86 ఏండ్లు. అతనికి నూరేండ్ల యీడున ఈస్సాకు జన్మించాడు. అనగా ఈసాకు యిష్మాయేలు కంటె 14 ఏండ్లు చిన్నవాడు.
   సొంతకొడుకు పుట్టాక సారాకు యిష్మాయేలు గిట్టలేదు. ఓమారు