Jump to content

పుట:Bibllo Streelu new cropped.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డగించారు. వాళ్లను క్రీస్తు సమీపంలోనికి రానీయలేదు. మా గురువుగారు అలసిపోయి వున్నారు వెళ్లిపొండి అన్నారు. కాని క్రీస్తు శిష్యులను కోపించి ఆ తల్లులను తన దగ్గరికి పిలిపించుకొన్నాడు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించాడు. ఈలా అతడు స్త్రీలనీ చిన్నబిడ్డలనీ ఆదరణతో జూచాడు. శిష్యులు కూడ ఆ బిడ్డల్లాగే తయారు కావాలని మందలించాడు. శిశువులు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించినట్లే వాళూ దేవుని మీద ఆధారపడి జీవించాలని బోధించాడు. యూద రబ్బయులు స్త్రీలకు దూరంగా వుండేవాళ్లు. దీనికి భిన్నంగా ప్రభువు స్త్రీలతో కలిశాడు -మార్కు 10, 13-16.

పాపాత్మురాళ్లయిన స్త్రీలతో మెలిగేప్పడు గూడ క్రీస్తు చాల దయాపూర్వకంగా ప్రవర్తించేవాడు. వ్యభిచారంలో పట్టుబడిన మహిళతో "నేనుకూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్లు. మళ్లా పాపం చేయకు అని మృదువుగా పలికాడు –యోహా 8,11. సమరయ ప్రీతో మనసుకు నొప్పి కలగనట్లుగా సున్నితంగా మాట్లాడాడు. తన పాదాలను కన్నీటితో తడిపిన స్త్రీని ఈమె అధికంగా ప్రేమించి అధికంగా పాప పరిహారం పొందిందని మెచ్చుకొన్నాడు -లూకా 7,47. ఈ పాపాత్ములందరితోను ప్రభువు వీళ్లు కూడ ముఖ్యమైనవాళ్లే అన్నట్లుగా ప్రవర్తించాడు.

రబ్బయులు బహిరంగంగా స్త్రీలతో మాట్లాడకూడదు. ఈ నియమాన్ని మీరి క్రీస్తు అందరియెదుట మహిళలతో మాట్లాడాడు. అలా అతడు సమరయ ప్రీతో మాట్లాడ్డం జూచి శిష్యులే విస్తుపోయారు - యోహా 4,27. స్త్రీలు రబ్బయుల దగ్గరికి రానేకూడదు. రబ్బయులను ఎంతమాత్రం ముట్టుకోగూడదు. కాని రక్తస్రావ రోగంతో బాధపడుతూ అశుద్ధురాలుగా గణింపబడిన స్త్రీ ప్రభువు అంగీ అంచును ముట్టుకొన్నా అతడు కోపించలేదు -లూకా 8,43-48. ఆలాగే పాపాత్మురాలు తన పాదాలను తాకినా అతడు నొచ్చుకోలేదు -7, 38. అతనికి స్త్రీలపట్ల చిన్నచూపులేదు.

క్రీస్తు వ్యాధి నయంజేసిన మైదటి స్త్రీరోగి పేతురు అత్త, ఆమె