పుట:Bibllo Streelu new cropped.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాసీగల కుటుంబం నుండి

కల్దీయుల నగరమైన ఊరు సారా జన్మస్థలం. ఆమె తెరా కూతురు. అబ్రహాముకి మారు చెల్లెలు. పేరుగల కుటుంబంలో పుట్టింది. మన కథలో ప్రత్యక్ష మయ్యేటప్పటికి ఆమెకు 90 ఏండ్లు. పెనిమిటి కంటే పది యేండ్లు చిన్నది -17,19, సారాకీ సిరిసంపదలూ అందమూ అన్నీ వున్నాయి. కాని సంతానం లేదు. గొడ్రాలుగా వుండిపోయినందుకు ఆమె చాల బాధపడేది. కాని దేవుడు ఆమెను కరుణించి వయస్సు మళ్లిన తర్వాత బిడ్డ అనుగ్రహించాడు. ముది వయసులో ఈసాకు పుట్టినందకు సారా నవ్వింది – 21.6.

                జాతులకు తల్లి
    యూదులకు తొలి తల్లిదండ్రులైన అబ్రాహాము, సారాలు యూదులు కారు, అన్యజాతివారు. యూఫ్రటీసు నదికి ఆవలి తీరంనుండి వచ్చినవాళ్లు. కనానీయులు వీరిని హిబ్రూలని పిలిచేవాళ్లు. అనగా వలస వచ్చినవాళ్లు అని అర్థం. అబ్రాహాము సారాల నుండి యూదజాతి ఉద్భవించింది. సారయి యూదులకు మొట్టమొదటి చారిత్రక మహిళ, శ్రేషురాలైన తల్లి.
       అబ్రాము సారా ఊరు నగరాన్ని వదలి హారాను పట్టణానికి వచ్చారు. ఇక్కడే దేవుడు అబ్రాముకి ప్రత్యక్షమై నీ దేశాన్ని చుట్టపక్కాలను వదిలి నేను చూపించే గడ్డకు వెళ్లు. నేను నీ నుండి పెద్ద జాతిని పుట్టిస్తాను. నీకు గొప్ప పేరు వస్తుంది. భూమి విూద కుటుంబాలన్నీనీనుండి దీవెనలు పొందుతాయి అని చెప్పాడు-12, 1-3 సారాకూడ దేవుడు పలికిన దీవెనలో భాగస్తురాలై జాతులకు తల్లెంది. బైబుల్లో సారా దైవభక్తికి పట్టుగొమ్మ. యూదులు నేటకీ తమ ఆడపిల్లలకు ప్రీతితో సారా అని పేరు పెట్టుకొంటారు.                                   
                

సారా అందం సారా అందగత్తె. ఒకసార్తి_క్రరువు రాగ అబ్రాహాము సారా