పుట:Bible Sametalu 4.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూస్తాము. ఈ సామెత సొలొమోను మన్తిష్కంలో మెదలడంలో మనకు అతని తండ్రి దావీదు మహారాజు స్ఫురిస్తాడు. సర్వోన్నత నర్వేశ్వరునికి చంద్రునికో నూలుపోగుగా ఒక ఆలయం నిర్మించాలని దావీదు తహతహలాడాడు. అందుకోసం స్థలం, సామగ్రి, నిపుణులు,సమన్తం సేకరించాడు. దావీదు అనే'నరుడు' పథకాలు చాలా పకడ్బందీగా సిద్ధం చేసుకొన్నాడు. కాని ప్రత్యుత్తరమిచ్చినది మాత్రం ప్రభువే.ఆయన 'నిర్మాణం నీ చేతుల మీదుగా జరుగరాదు, ఆ కార్యం శాంతి సార్వభౌముడైన నీ కుమారునిది' అని ఒక్క మాటలో తన అభీష్టాన్ని వెల్లడించాడు. ఈ వ్యవహారమంతటిలో సొలొమోను రొట్టె విరిగి నేతిలో పడినట్టయింది. ఏర్పాట్లన్నీ తండ్రి నంపూర్ణం చేశాడు. ఆలయ నిర్మాణకుడన్న కీర్తి మాత్రం తనకు దక్కింది.


తెలుగు సామెతలో ఆశలు అడియాశలైన విధి వంచితుని నిర్వేదం కనిపిస్తుంతుంది. బైబులు సామెతలో అంతకు మించిన ఉదాత్తభావం గోచరిన్తున్నది. దైవ సంకల్పం అమోఘం, అనివార్యం అన్న న్పృహ బైబులు సామెతలో అంతర్లీనంగా ఉంది.

7

తెలుగు సామెత : తొలకరి చెరువు నిండినా, తొలిచూలు కొడుకటు పుట్టినా మేలు బైబులు సామెత : యౌవనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలోని బాణములవంటివారు (కీర్తనలు 127:4)

రోహిణికార్తె గడిచి తొలకరి జల్లులు నేలను తడుపుతాయి. కొన్ని ఊర్లకు చెరువే ప్రాణాధారం. వానలకు చెరువు నిండితే మనుషులకు, పశువులకు కమ్మని నీరు లభిన్తుంది. చెరువు తామరలతో కలువలతో పక్షులతో కళకళలాడడం ఊరికే శోభ'. కుటుంబానికి తొలిచూలు కొడుకూ అలాటివాడే అంటున్నది తెలుగు సామెత. తన భాధ్యత లొక్కక్కటిగా పెరిగి పెద్దవాడైన తనయుడు అందిపుచ్చుకంటుంటే కొడుకు అందివచ్చాడని తండ్రి మురిసిపోతాడు. బాధ్యత గల పెద్ద కొడుకు తన తమ్ముళ్ల చెల్లెళ్ల బాగోగులు తండ్రి తరువాత తండ్రిగా తానే చూసుకుంటాడు. అందుకే

282