పుట:Bible Sametalu 4.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ దైవమని, ఎవరి క్రియల ప్రకారం వారికి ఫలితాన్నిస్తాడని, కాబటివ ఆ దేవునికి తప్ప మరెవరికీ భ'యపడనవనరం లేదని ధార్మికటులకటు ధైర్యం కటలుగుతుంది. తెలుగు సామెత, బైబులు సామెతలు రెండూ రాజు ఈ లోకటంలో బలవంతుడై ఇతరులను బాధిన్తే, దైవం రాజును, అతని కటుటుంబాన్ని బాధిస్తాడని బోధిన్తున్నాయి.

3 తెలుగు సామెత : ఎవరి కర్మను వారు అనుభ'విస్తారు బైబులు సామెత : దుష్టుడు తన కార్యములకటు తగిన ఫలమును పొందును, నజ్జనుడు తన పనులకటు బ,ుమతి పొందును (సామెతలు 14:14) 'పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జరవరే శయనం' అన్న శంకటర భగవత్పాదుల అమోఘ వాకట్కులను భక్తి శ్రద్ధలతో తలదాల్చిన జాతి భ'రత జాతి. ఈ ప్రాపంచికట దృకట్పథం ఈ గడ్డపై పుట్టిన వారందరికీ నంక్రమిన్తూ దిశానిర్దేశనం చేన్తూ కొనసాగుతున్నది. దీనిని అనునరించి గత జన్మ పాప పుణ్య ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలనేది భారతీయులు నమ్మే నత్యం. బైబులు సామెత కటూడా ఇదే పదాలను ఉపయోగిన్తున్నది. అయితే ఇశ్రాయేలు జాతి ప్రాపంచి దృక్పథంలో పునర్జన్మకు తావు లేదు. మనిషి ఒకట్కసారే మరణిస్తాడు. ఆ తరువాత తీర్పు అని బైబులు నెలవిన్తున్నది.

ఇకటపోతే ఈ రెండు సామెతలూ ప్రతిపాదిన్తున్న దివ్యోపదేశాన్ని నైతికట నియమాలకటు, సామాజికట కటటువబాట్లకటు, దైవ శాననానికీ లోబడకటుండా ఇంద్రియాల లంపటంలో పడి విషయానక్తితో నన్మార్గం విడిచినవారు శిలా శాననం వలె ఎంచి గుర్తుంచుకోవాలి. ప్రతిదానికీ, దానికి తగిన ప్రతిక్రియ ఉండడమనేది ప్రకటృతి ధర్మం. మనం చేనిన ప్రతిదానికీ ప్రతిఫలం తప్పకట అనుభ'వించవలని ఉంటుంది. పిల్లల పెంపకాన్ని విన్మరించి ఉద్యోగ ధర్మంలో, ధన నముపార్జనలో తలమునకటలయ్యే తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో పిల్లల మమతానురాగాలకు నోచుకోరు. మన క్రియలన్నిటికీ నమానమైన వ్యతిరేక ఫలితం మనమే అనుభవించడం అనివార్యం.

278