పుట:Bible Sametalu 4.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దరిచేరవు. ఒకవేళ ఏవైనా చెడు అలవాట్లు, ఆలోచనలు దరిచేరినా తన క్రటమశిక్షణతో, దైవభ'యమనే లక్షణం సాయంతో వాటిని దూరంగా తరిమివేయ గలుగుతాడు. నిప్పు దగ్గర చెదలు పుట్టడం గాని, చీడపురుగులు చేరడం గానీ జరగదు. దైవ భ'యము కలిగినవాడికి ఎటువంటి పాపములు దరిచేరవు. పాపము చేన్తే దేవునికి దూరమైపోతాననే భ'యమే పాపములో పడకుండా ఆ వ్యక్తిని కాపాడుతుంది. అటువంటి వ్యక్తి దరిదాపులకు వెళ్ళడానికి కూడా పాపము జంకుతుంది. క్రమశిక్షషణ, దైవ భ'యమనేవి చెడు మార్గములో వెళ్ళకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని ఈ రెండు సామెతల ద్వారా మనకు తెలున్తుంది. 'కుండలి యోగము తెలినిన బండాలము యోగికేల బాలిక పొందు దండిగ నా తనువందునె మెండుగ నిల ముక్తి కాంత మెలగుర వేమా' కుండలి యోగము నెరిగిన ఉత్తమ యోగికి స్త్రీనంగమంపై కోరిక ఉండదు. ముక్తి కాంతయే మదిలో మెదులుతుండగా మానవ కాంతలపై అట్టివానికి మననెలా నిలున్తుంది? అని అందుకే అంటాడు వేమన. ఇలాటి పరమ భక్తులను లోకం తాత్కాలికంగా అర్థం చేనుకోలేకటపోవచ్చు కానీ భ'క్తులు మాత్రం పరిశుద్ధాంతఃకటరణులై, దురితదూరులై ఉంటారు. నబ్బుకు మురికి కావడం, నిప్పుకు చెదలంటడం ఊహించలేము. దైవం పట్ల భ'యభక్తులే మనిషి నైతిక వర్తనకు శ్రీరామరకక్ష అని పై సామెతల భావము. 12 తెలుగు సామెత : నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు బైబులు సామెత : నరుల హృదయములు దేవునికి తెలియును (సామెతలు 15:11) పంచదార తియ్యగా ఉండడం లోక ప్రసిద్ధం. అలాగే నీరు పల్లానికి ప్రవహించడం జగమెరిగిన నత్యం. వీటిని కాదనేవాడు అబద్దీకుని అందరూ అంగీకరిస్తారు. అదే

287