పుట:Bible Sametalu 3.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమి ప్రయెజన౦౦ లెకు౦డా పడి ఉండవలసినదే కదా! మనకు ప్రయోజనం కలిగించని విషయాలు, పనులు లేదా సమాజానికి ఏ మాత్రం లాభ౦ చేకూర్చని పనులు చేనేవారిని గురించి వారు చేసే పనులను గురించి మాట్లాడే నందర్భములో ఎక్కువగా ఈ సామెతలను ఉపయోగిస్తారు. రెండు సామెతలు కూడా ఫలవంతం కాని, ప్రయోజనం లేని పనులను గూర్చి చెబుతున్నాయి. కాబట్టి పని మొదలు పెట్టేటప్పుడు అది ఎంతవరకు నమంజస౦? ఎవరికి, ఏ రక౦గా ప్రయోజనం చేకూరున్తుంది? అని ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తుకు తెస్తున్నాయి ఈ రెండు సామెతలు. 'సవరన భావాలంకృత కవితా గోష్ఠియును, మధుర గానంబును దా నవివేకి కెంత చెప్పినా జెవిటికి స౦కూ దినట్లు సిద్ధము నుమతీ' అని అంటాడు బద్దెన. చెవిటివాని ఎదుట శ్రావ్యంగా శంఖమూదడం, సూకరాల ఎదుట నవమౌక్తికాలు వెదజల్లడం, మూర్ఖునికి నీతి సూక్తులు బోధించడం తదితర ఉపమానాలన్నీ ఈ కోవలోనివే. నాగరికులు నడయాడే సైకత స్తలాలలో, ఉద్యాన వనాల్లో పిండార బోనినట్టు వెన్నెల కాస్తే అది నర్వజన మనోరంజకమౌతుంది గానీ ఆస్వాదించి ఆనందించే మనిషే లేని కారడవిలో కాన్తే ఏమి ప్రయోజనం. భాన్కర శతకకారుడు ఈ సామెతల్లోని భావాన్ని సకారాత్మక౦గా వినిపించి కర్తవ్య బోధ గావించాడు. సిరిగల వానికెయ్యడల జేని నే మేలది నిష్ఫలంబగున్‌ నెరిగురి కాదు పేదలకునేర్పునజేసిన నత్ఫలంబగున్‌ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్‌ గురిసిన గాక యంబుధుల గుర్వగనేమి ఫలము భాన్కరా! సామెతలు ప్రబోధత్మకాలు, కర్తవ్య నుబోధకాలు. నిరర్థకటమైనవి ఇన్నిన్ని అంటూ చెప్పుకోవడం గాక నత్ఫలితాన్నిచ్చే క్రియలను చేయడం శ్రేయోదాయక౦ అని ఈ సామెతల ద్వారా తెలునుకోవచ్చు. 170