పుట:Bible Sametalu 3.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నడుచుకొమ్మని ఉద్బోధిస్తున్నాడు కవి: 'విశ్వనిర్మాత చలన్లి వీక్సనమున నేటికిని గె౦పుచార గాన్పింపలేదు మూర్ఖలోకము దినమెల్ల ముగియలేదు దీపమున్నది హృదయంబు దిద్దుకొనుము'

బైబులు సామెతలో సెతౖం సామాన్యార్థం తేటతెల్లం . యూదులు బహు శౌచాచార పరాయణులు. వారికి అంటు, మైల మెండు. శుచికై వారు అనుష్టి౦పవలసిన మత కర్మకాండలు అసంఖ్యాకం. ఒక్కొక్క రకం అశుద్ధికి కడగా ఉండవలసిన కాలపరిమితులు శుద్ధి సంస్కారాలు ఒక్కొక్క రకం . మృత కళేభరాన్ని స్పృశించినవాడు సూర్యాస్తమయం వరకు అశుద్ధుడు. ఆ సమయంలో ఎంత అత్యవసరమైన కార్యమైనా అలా ఉండవలసిందే. అందుకే ఇటువ౦టి నిర్దుష్టాచార దురంధరులు ప్రతి అడుగూ ఆచితూచి వేయ వలసి ఉంటుంది. ముఖ్యంగా తనను మైలపడజేసే వాటి విషయ౦లో. యూదుల శుద్ధీకరాణచార విధుల నేపథ్య౦లో ఈ బైబులు సామెత ఉనికిలోనికి వచ్చింది. మొత్తముమీద ఈ రె౦డు సామెతలూ అనవసర విషయాల జోలికి వెళ్ళ కుండ తీసుకోవలసిన జాగ్రత్తను గురించి తెలియజేస్తూన్నాయీ.

       3

తెలుగు సామెత : అడుసులో నాటిన స్తంభము

         అడవి గాచిన వెన్నెల

బైబులు సామెత : ఇసుక మీదా కట్టిన ఇల్లు (మత్తయ4:26)

  ఎంత పెద్ద కట్టడం నిలవాలన్నా పునాది సరిగ్గా లేకపోతే అది వ్యర్ధమే. ఇసుక మీద ఇ౦టిని కడతే, అది గట్టగా పట్టు కలిగి ఉండదు గదా! అదే విధముగా స్తంభము ఎంత గట్టదైన ఎంత పట్టుకలది అయినా నాటిన స్థలమును బట్టి దాని ప్రయోజనం ఉంటుంది. బురదలో స్తంభం నాటితే దానికి పట్టు దొరుకుతుందా? ఆ స్తంభం
                169