పుట:Bible Sametalu 2.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3''

తెలుగు సామెత : చెడి స్నేహితుని ఇంటికి పోవచ్చు గానీ సోదరునింటికి పోరాదు బైబులు సామెత : ఆపదలు వచ్చినప్పుడు స్నేహితునింటికి పొమ్ముగాని సోదరునింటికి పోవలదు (సామెతలు 27:10)

     నెత్తురు నీటికన్నా చిక్కన అని ఓ ఆంగ్ల సామెత. స్నేహాలు, అనుబంధాలు ఎన్నున్నా రక్త సంబంధమే అని దీని భావం. అయితే ఇక్కడ మానవ సంబంధాలలో ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని బైబులు, తెలుగు సామెతలు రెండూ ప్రతిపాదిస్తున్నాయి. 
     తమ్ముడు కష్టాలలో ఉంటే చేయూతనివ్వడం  అన్నగారి విధి, బాధ్యత. అన్నను ఆశ్రయించడం  తమ్ముని హక్కు ఇందుకు భిన్నంగా తెలుగు, బైబులు సంస్కృతులు రెంటిలోనూ మన పూర్వికులు ఈ విచిత్రాన్ని గుర్తించారు. అది సామెతగా అవతరించింది. ఇబ్బందులలో ఉన్నప్పుడు సోదరుని ఇంటికి వెళ్ళడం కంటే స్నేహితుని ఇంటికి వెళ్ళడానికే మనసు మొగ్గు చూపుతుంది. దీనికి అనేక కారణాలుండవచ్చు. గతంలో తాను చేసిన అనేకమైన తప్పటగులు సోదరునికి తెలిసి ఉండడం వాటిలో ఒకటి . ఇప్పుడు ఇక్కట్లో ఉండి సోదరుణ్ణి ఆశ్రయిస్తే 'మరి, నేను చేబితే  విన్నవా ? అని అతడు ఈసడించవచ్చు. అప్పటికే అనేకమార్లు సోదరుని వద్ద సాయం పొందిన సందర్భాలూ ఉండి ఉందివచ్చు. అన్న దగ్గరికి వెళ్ళదం ఫర్వాలేదు గానీ వదినెగారి వ్యంగ్యాలూ మూతి విరువులూ సహించడం కష్టం కావచ్చు. తానున్న కష్టస్ధితి కుటుంబమంతటికీ తెలిసిపోతుందన్న సంకోచం కావచ్చు. స్నేహితునితో ఈ బాధలుండవు. అతడు నిన్ను నిన్నుగా స్వీకరిస్తాడు. తిట్లు, ఉపదేశాలు, కోపాలు ఉండవు. పైగా ధనమున్నప్పుడే బంధుత్వం. పేదవాడిని, అవసరం ఉన్నవాడి స్వంత తమ్ముడైనా చేరదీయడు  మానవ స్వభాం . అందుకే 
 విత్తహీనమైన వేళలందును తల్లి  
 దనయులాలి సుహృదులనెడి వార 
 లెల్ల శత్రులగుదు రెండైన నజమిది' అని అంటాడు వేమన. 
 సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నట్టు తోడబుట్టినవారి కంటే కూడా