పుట:Bible Sametalu 2.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2. సాహిత్యాన్ని ఇతర శాఖలతో పోల్చడం. ఈ రెండిటిలోనూ అనేక అంతర్విభాగాలు ఉన్నాయి.

భాషలు, దేశాలు, జాతులు మొదలగువాటి మూలంగా మనుష్యులు విడిపోయేటప్పుడు వాటిని భౌతికమైన స్వల్ప విషయాలుగా చూపుతూ వాటి వెనుక ఉన్న చిరంతన మానవ మౌల్యాలను ప్రస్ఫుటం చేస్తూ మానవులలో విశాల దృక్పథాన్ని పెంపొందింపజేయడమే తులనాత్మక సాహిత్య ప్రధాన లక్ష్యం.

ప్రన్తుత పరిశోధనాంశం 'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' తులనాత్మక సాహిత్య పరిశోధనంలో రెండవ భాగానికి చెందిన ప్రత్యేక సాహిత్య ప్రక్రియల తులనాత్మక పరిశీలనానికి చెందినది.

ఈ నేపథ్యంలో తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనాన్ని ప్రారంభిద్దాం. ఈ తులనాత్మక పరిశీలనంలో సమానార్థకాలైన తెలుగు, బైబులు సామెతలను ఏడు అధ్యాయాలలో పొందుపరిచాను. అవి:

1. తెలుగు, బైబులు సామెతలు: మానవ స్వభావం

2. తెలుగు, బైబులు సామెతలు: ఉపదేశం

3. తెలుగు, బైబులు సామెతలు: సార్వత్రిక సత్యాలు

4. తెలుగు, బైబులు సామెతలు: నమ్మకాలు, విశ్వాసాలు

5. తెలుగు, బైబులు సామెతలు: స్త్రీ

6. తెలుగు, బైబులు సామెతలు: వ్యవసాయం

7. తెలుగు, బైబులు సామెతలు: ఇతరాలు

ఇప్పుడు మొదటి అధ్యాయంతో ముందుకు సాగుదాం.77