పుట:Bible Sametalu 2.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3 తెలుగు సామెత : ఉన్నమ్మ గతే ఇలా ఉంటే లేనమ్మది ఎలాగుంటుంది? బైబులు సామెత : పచ్చి మ్రానుకే ఇట్లు జరిగితే ఎండిన మ్రాను గురించి ఏమి చెప్పగలము? (లూకా 23:1)

    సాధారణంగా ధనమున్నవారికి, అన్ని హంగులు బలగం బలం ఉన్నవారికి అన్నీ సానుకూలంగానే జరుగుతాయి. ఏ లోపమూ ఉండదు. ఎవరూ ఎదురాడరు. అయితే ఒక్కొక్కరి అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, బలం అర్హత ఉన్నా అనుకున్న పని, తలపెట్టిన పని జరుగనే జరగదు. మరి అన్నీ ఉన్నమ్మకే ఆ విధంగా జరిగితే ఇక ఏమీ లేనమ్మ సంగతేమిటి? ఆమె గతి వర్ణనాతీతం గదా!
   డబ్బు, పలుకుబడి, అర్హత ఉన్నవాళ్ళకే ఏ పనీ సానుకూలమయి, సత్ఫలదాయకం కాకపోతే ఇక దరిద్రులకు, ఏ అండా అర్హతా లేనివాళ్ళకు ఏ పనీ జరుగదని భావం. అటువంటి సందర్భాలను వివరించే నమయంలో ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తారు.
   యేనుక్రీన్తును సిలువ వెయ్యడానికి తీసుకొనిపోతున్నారు. ఆయన మీద మహ భారమైన సిలువను ఉంచి మోపిన్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఆయన రక్తదారలు చిమ్ముతూ సిలువ భారంతో పడుతూ లేన్తూ నడున్తున్నాడు. అప్పటి వరకు ఆయన చేసిన ఉపకారాలను అనుభవించిన స్రిలు ఆయనను చూచి విలపిన్తున్నారు. అప్పుడు క్రీన్తు 'నా కోనం ఏడువవద్దు, మీ కోనం మీ పిల్లల కోనం ఏడువండి. వారు పచ్చి మ్రానుకే ఇలా చేన్తే ఎండినదానికి ఇంకెలా చేస్తారో' అని వాళ్ళతో చెప్పాడు. అందరికీ మేలు చేనిన, అన్ని రోగాలు బాగుచేసి శాంతి మార్గాన్ని బోధించిన తనకే వారు (యూదులు) అటువంటి కష్ట్తాలు కలిగిన్తే, ఇక మామూలు మనుషులకు ఎంతటి కస్ట్తాలు కలిగించి వారిని ఎలా బాధిస్తారో కదా! అని దీనికి అర్థం.
   కాగా అన్నీ ఉన్నవారికే అన్యాయం జరిగినప్పుడు, నంఘాన్ని ఉద్ధరించిన వారికే కరివ శిక్షలు పడినప్పుడు ఏమీ లేనివారికి మామూలు మనుజులకు ఇక ఏమి జరుగుతుందో ఎంత అపకారం, అపాయం సంభవిన్తుందో ఎవరికైనా అనూహ్యయ. ఇటువంటి సందర్భాలను వివరించేటప్పుడు ఈ తెలుగు, బైబులు సామెతలు రెండింటినీ సమానార్థకాలుగా ప్రయోగిస్తారు.
          102