పుట:Bible Sametalu 2.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుప్పిన్తూ ఆప్తుడన్న భావన కలిగిస్తాడు. ఇలాటి వ్యక్తలను గురించి వేమన పరిపరి విధాల హెచ్చరించాడు:

    'అంతరంగమందు నపరాధములు చేసి
     మంచివాని వలెనె మనుజుడుండు'
       మనస్సున ద్రోహచింత కలిగి పైకి శుష్కప్రియాలతో ప్రేమలు ఒలకబోనేవాడు బహు ప్రమాదకారి. అతి వినయం ధూర్త లక్షణమన్నది తెలుగువారి నోట నానుతుండే సామెత. బైబులు సామెతలో నక్క వినయమన్నది దీనికి సాటియైన మాట. సింహం వద్ద నక్క మోరదించి తోకను రెండు కాళ్ళ మధ్య ముడుచుకొని దూరం దూరంగా తొలుగుతూ వినయం ఒలకబోన్తుంది. సింహం  గా యపడి నేలగూలిన తరుణంలో దాన్ని నజీవంగా తినడానికి కూడా నక్క వెనుకాడదు.
     'ద్రోహియైనవాడు సాహసంబన నెట్టి
     స్నీహితునికినైన చెరుపు చేయు
      నూహ కలిగియుండు నోగుబాగులు లేక' అంటూ ఇలాటి టక్కరుల నైజాన్ని ఎండగట్టాడు వేమన.
      ధూర్తుల నైజమెరిగి దూరంగా ఉండడం ఉత్తమం. హని చేనే తలంపు లేకున్నా అధములు కొందరు లాభమాశించి లేని ప్రేమలు నటిస్తారు. పబ్బం గడవగానే కనుమరుగవుతారు. 'ఓడ మల్లయ్యా' అంటూ గౌరవించినవారు ఏరు దాటాక ఆ సరంగును 'జోడి మల్లయ్యా' అని గేలిచేస్తారు. సాయమడిగిన వారికి చేతనైనంత వరకు చేసి పంపించడమే పాటి గానీ, వారి మాటలు నమ్మి ఆత్మ బంధువుల వలె వారిని ఎంచరాదు. ఈ సామెతలు నేర్పించే పాఠం ఇదే.
                        2

తెలుగు సామెత : ఉండేది గట్టి, పోయేది పొట్టు బైబులు సామెత : దుర్మార్గుడు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టులాంటివాడు

                 (కీర్తన 1:4)

100