పుట:Bible Sametalu 2.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇకపోతే వ్యవహారంలోకి వచ్చేసరికి ఈ సామెతను ఉపయోగించేది బుద్ధిమాంద్యం గలవారిని గాని,బుద్ధిపూర్వకంగా ఏమరుపాటు ప్రదర్శించే వారిని గానీ ఉద్దేశించి కాదు. పెద్దలు హితోపదేశం చేన్తూ కర్తవ్య బోధను గావించే నమయంలో ఎదుటివాడు ఇంకా నందేహిన్తూ'అయితే నేనిప్పుడేమి చెయ్యాలి'వంటి సందిగ్ధ వచనాలు పలుకుతూ ఉండే సందర్భంలోఈసామెత ఉపయోగించడం కద్దు.కొంత విసుగుగా,కొంత చనువుగావాత్సల్యపూరితంగా ఆ వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేయడం కోనం ఈ సామెత ప్రయోగిస్తారు.

    బైబులు సామెత తెలుగు సామెత అంత నిశితంగా,హాస్య రసస్ఫోరకంగా లేకున్నప్పటికీ అదే భావాన్ని ప్రతిపాదిన్తున్నది.మూర్ఖుడు, లేదా చపలుడు విషయమంతా విని ఇంతకీ నీవు చెప్పేదేమిటి అని అంటాడని భావం. తాను చెయ్యవలనినది స్పష్టంగా కూలంకషంగా అవతలి వ్యక్తి చెప్పినా దాన్ని పాటించడం ఇష్టం లేకనో, చేతగాకనో ఈ మాట పలకవచ్చు. లేక నిజంగానే ఏదీ చొరలేని అయోమయపు మస్తిష్కంతో అవగాహన లేమితో ఏది విన్నా, అంతా అయిపోయిన తరువాత నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు అనవచ్చు.
   ఈ రెండు సామెతల అంతరార్థం స్పష్టం.మనుషులు సూక్ష్మగ్రాహులై  తమ మేలుకోరి హితోపదేశం చేసేవారి అభిప్రాయాలను అందిపుచ్చుకొని సదసద్వివేకం అలవరచుకోవాలి.

దౌష్ట్యం

                    1

తెలుగు సామెత : అతి వినయం ధూర్త లక్షణం బైబులు సామెత : దుష్టుడు నక్క వినయముతో దండము పెట్టినను  : నమ్మరాదు (సీరా 12:11)

   దుర్జనుడు పైకి అనుకూలంగా ఉన్నట్టు నటిన్తూ లోలోపల హాని తలపెడుతూ ఉంటాడు.అలాటివాడు ఏదుర్బుద్ధీలేనివానికన్నా నయగారాలు మెరమెచ్చులు
                    99