పుట:Bible Sametalu 2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిగా తన ధోరణిలోనే సాగిపోయేవానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొంత కాలానికి అలాటివారు గుణపాఠం నేర్చుకొని సన్మార్గంలోకి రావచ్చును. జ్ఞాని ఇతరుల అనుభవం నుండి నేర్చుకుంటాడు అని నానుడి.

    సున్నిత,ాృదయునికి, నంస్కారవంతునికి ఒకట హెచ్చరిక దిద్దుబాటు నరిపోతుంది. అవివేకిని పదేపదే హెచ్చరించి దండోపాయం ప్రయోగించినా తన దుర్మార్గం వీడడు. ఈ వాన్తవాలనే ఈ సామెతలు వెల్లడిన్తున్నాయి.
               13

తెలుగు సామెత : రామాయణమంతా విని రామునికి నీత ఏమవుతుందని అడిగినట్టు బైబులు సామెత : మూర్ఖుడు చెప్పినదంతయు విని, నీనేమి చెప్పితివని అడుగును

                (నీరా 22:8)
   ఏకసంథాగ్రాహులుంటారు. ఒకసారి చెబితే విని, దానిని ఉన్నదున్నటుగా అప్పజెప్పడంలో దిట్టలట. ధారణ, గ్రహణ శక్తి పుట్టుకతో వస్తాయో లేదో గానీ, అభినివేశం కలిగి అభ్యానం చేన్తే అలవడే నిపుణతలే ఇవి. అవధానాలలో ఇలాటి దృశ్యాలు కోకొల్లలుగా కనిపించి ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తాయి.
  దీనంతటికీ వ్యతిరేకంగా కనిపించే బుద్ధిమాంద్యం గల వారి గురించి చెబుతున్న సామెతలు పై రెండూనూ. మూర్ఖుడు అని బైబులు సామెతలో ఉపయోగించిన శబ్దానికి సందర్భోచితంగా రెండు అర్థాలు స్పురిస్తున్నాయి. చెవినిల్లు కట్టుకుని ఓపికగా చెప్పినదానిని ఎంతమాత్రం ఆకళింపు చేనుకోలేని మందబుద్ధులు కొందరు. ఎదుటివాడు చెబుతున్నదానిని ఒక చెవితో విని వేరొక చెవితో వదిలివేనసి అసలు విషయం గ్రహించడానికి బుద్దిపూర్వకంగా నిరాకరించే తుంటరులు మరికొందరు.
   తెలుగు సామెత తెలుగునాట బహుళ ప్రచారంలో ఉంది. సీతారామ యణం వియోగం, రావణ వధ, పునన్సమాగమం వంటి అంశాలు రామాయణ గాథకం ఆయువుపట్టులు. రామాయణమంతటినీ మూడు ముక్కల్లో కటె కొటె తెచ్చె అంటూ చెప్పినా దీనిలో దనుజుని చెర నుండి ధర్మపత్నిని విడిపించడానికి దాశరథి చేనిన వీరోచిత కార్యాలే ప్రన్ఫుటంగా కనిపిస్తాయి. కాగా రామాయణ గాథ అంతా విని ఇంతకీ రాముడికి సిత ఏమి కావాలి అనడాన్ని ఏమనుకోవాలి?
                       98