పుట:Bible Sametalu 2.pdf/2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
II. తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం

ప్రన్తుత పరిశోధనాంశం తులనాత్మక సాహిత్యానికి చెందినది. అందువలన తులనాత్మక సాహిత్యం గురించి న్థూలంగా తెలుసుకుందాం.

తులనాత్మక సాహిత్యం: అభివృద్ధి చెందుతున్న సాహిత్య విభాగాలలో తులనాత్మక సాహిత్యం ముఖ్యమైనది. ఇది జర్మన్‌ జానపద సాహిత్యంలో చిన్న శాఖగా ప్రారంభమైనది. నేడు పండితుల ఆదరణను పొంది ప్రపంచమంతటా ఆధునిక సాహిత్య పరిశోధనగా అభివృద్ధి చెందినది. గత ఆరు దశాబ్దాలుగా మన దేశంలో కూడా తులనాత్మక సాహిత్య పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

ఒక వస్తువును మరొక వస్తువుతో, ఒక వ్యక్తిని వేరొక వ్యక్తితో, ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశంతో, ఒక అంశాన్ని మరొక అంశంతో పోల్చి పరిశీలించడం మానవ సహజ స్వభావం. ఒక అంశాన్ని స్పష్టంగా అవగతం చేసుకోవడానికి, దాని విలువలను ఖచ్చితంగా అంచనా వేయడానికి, వేరొక అంశంతో వేరుపరచి దాని స్థానాన్ని నిర్ధారించడానికి పోల్చి చూడడం అనే పద్ధతి చాలా ఉపకరిస్తుంది.

తులనాత్మక సాహిత్యం ఈ పోల్చి చూడడమనే ప్రాతిపదిక మీదనే పుట్టింది. 'పోల్చి చూడడం', 'తులనాత్మక సాహిత్యం' రెండూ ఒక కుదురులోనే పుట్టినప్పటికీ ప్రాథమికంగా ఇవి రెండూ భిన్నమైనవి. పోల్చడం ఆత్మాశ్రయమైనదైతే, తులనాత్మక సాహిత్యం వస్త్వాశ్రయమైనది. పోల్చడం అనుభూతి ప్రధానమైనదైతే, తులనాత్మక సాహిత్యం శాన్త్రీయమైనది. పోల్చడానికి వైజ్ఞానిక పద్ధతి ఉండదు. తులనాత్మక సాహిత్యం వైజ్ఞానిక పద్ధతులను పాటిస్తుంది.

'తులనాత్మక సాహిత్యమంటే నిర్దేశిత దేశ సరిహద్దులకు అతీతంగా ఒక సాహిత్యాన్ని మరొక సాహిత్యంతోనో, సాహిత్యాలతోనో, సాహిత్యేతర వైజ్ఞానిక శాఖలతోనో తులనాత్మకంగా పరిశీలించడం' అని తులనాత్మక సాహిత్య పరిశోధకుడైన H.H. Remak నిర్వచించారు.1

ఈ నిర్వచనాన్ని అనునరించి తులనాత్మక సాహిత్య పరిశోధనను న్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. సాహిత్యాన్ని సాహిత్యంతో పోల్చడం,


1 జయప్రకాశ్, ఎన్‌. తులనాత్మక సాహిత్యం, శ్రీ దివ్య పబ్లికేషన్స్‌, మదురై, 1998, పుట 6

76