పుట:Bible Sametalu 2.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నష్టము వచ్చిన తరువాతనో , లేక నిర్ణయాలు బెడిసికొట్టినప్పుడో హడావుడిగా పెద్దల దగ్గరకో, అయినవారి దగ్గరకో రక్షించమని పరుగెడతారు. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అందుకే చేతులు కాలకముందే ముందు జాగ్రత్త తీసుకోవాలి గాని, కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. ఈ విషయాన్ని సూటిగా తేలికైన భాషలో చెబుతుంది. నష్టము జరిగిన తరువాత గురువులు చెప్పిప్పుడు, హెచ్చరించినప్పుడు వినలేదే, వారు ఎంతో వివరముగా ఉదాహరణలతో చెప్పినా పెడచెవిని పెట్టానే అని బాధపడుట అనవసరం. ఆ అలోచన,విశ్లేషణ ముందే ఉండాలలి. జరగవలిసిన నష్టం జరిగిన తరువాత కాదు. ముందుచూపు సలహాలను స్వీకరించే అలవాటు , తప్పులను అంగీకరించి మార్చుకునే ప్రయత్నం వంటి లక్షణాలను నష్టం కలుగకుండా కాపాడుతాయని ఈ సామెతల ద్వారా నేర్చుకోవచ్చు.


కొన్ని తప్పులకు మనుషులు, దేవుడు కూడా క్షమించవచ్చును గానీ ఆ పాపకర్మను ఆ వ్యక్తి అంభవించక తప్పదు. కాముకుడై విచ్చలవిడి వ్యభిచారంలో మునిగి తేలిన వాడికి ఎయిడ్స్ వంటి వ్యాధి సోకితే ఇక దానికి మందు లేదు. ఆ తరువాత ఎంత డబ్బు పోసినా ,ఎన్ని తీర్ధాలు తిరిగినా నిష్కృతి లేదు. జరగవలిసింది జరిగిపోయాక మనిషి మారి మూనీశ్వరుడైనా ఇక తరుణోపాయం లేదు.


' శ్రవణ పుటుములున్న సార్ధక్యమేమిరా
వినగ వలయు బెద్దలనెడి వన్ని
వినగ వినగ విశదములౌ సుమ్ము '
అనే వేమన చప్పిన నీతినే బైబులు సమెతా,తెలిగు సామెత ఉపదేశిస్తున్నాయి.


తెలుగు సామెత ; తా మెచ్చింది రంభ - తా మునిగింది గంగ
బైబులు సామెత ; మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది (సామెతలు 12:15)
   'ఎవడి పిచ్చి వాడికానందం' అనే సామెత కోవకు చెందినదే ఈ తెలుగు సామెత. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే "తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు" అనే సామెత కూడా ఈ భావాన్నే ప్రతిపాదిస్తున్నది.          90