పుట:Bible Sametalu 2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఎన్నడూ ఎరుగనివాడు తిరునాళ్ళకు వెళ్ళితే ఎక్కాదీగా నరిపోయిందట. తిరునాళ్ళకు వెళ్ళి ఏదైనా చూడాలి, ఆనందించాలి, లబ్ధి పొందాలి. ఊరికే కొండనెక్కి దిగివన్తే లాభమేముంది? వృధా శ్రమే కదా! గుప్తనిధుల కోనం, గొప్ప ప్రయోజనం కోనం శ్రమించి కొండను తవ్వాలి. కేవలం ఎలుకల కోనం కొండను తవ్వడం వృధా ప్రయత్నం!

   ఒక మానవుడు లోకమంతా నంపాదించుకున్నాడు. తాను తన ఆత్మను కోల్పోవు - నరకమునకు వెళ్ళు - స్డితిలో మరణించాడు. ఇది వృధా శ్రమ. తన ప్రాణానికి బదులుగా మానవులు ఏమి ఇచ్చినా అది తక్కువ అవుతుంది. ఇది ఆధ్యాత్మిక జీవితానికి, నిత్యరాజ్య వారనత్వానికి నంబంధించిన సామెత. మానవ జీవితం విలువైనది. మానవుడు నిజంగా దైవన్వరూపుడు. అతడు లోకమంతా నంపాదించుకొని తన ఆత్మనే కోల్పోతే ప్రయోజనమేముంది?
   బైబులు సామెతలో ఉన్న నిగూఢార్థం తెలుగు సామెతలో లేదు. ఇది కేవలం వృధా ప్రయాసను అధిక్షేపిన్తూ చెప్పిన సామెత. మొనగాళ్ళ కొందరు బయలుదేరి ఏదేదో సాధిస్తామని విర్రవీగి తీరా వట్టి చేతులతోనో ఎవరికీ ప్రయోజనం లేని వ్యర్థ ఫలితంతోనో తిరిగి వన్తే హాస్యాస్పదంగా  ఈ మాట అంటారు. సామాన్య జ్ఞానం చొప్పున ఎవరైనా నులభంగా చెప్పగలిగినదానిని చాలామంది శాన్త్రజ్ఞులు పరిశోధనలు చేని కొత్తగా కనిపెట్టివనట్టువ చెబితే సామాన్య జనం నవ్విపోతారు కదా.
                      6

తెలుగు సామెత : చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు బైబులు సామెత : గురువుల బోధను పెడచెవిని పెట్టితిని వారి ఉపదేశములను లెక్క చేయనైతిని (సామెతలు 5:12-13)

     మానవుడు తన జీవితములో అనేక నందర్భాలలో ఎంతోమంది,సలహలు తీనుకుంటాడు. ఒక పని చేయబోయే ముందు ఎందరినో నంప్రదిస్తాడు. కానీ పెద్దలు, సన్నిహీతులెంత చెప్పినా కొందరు వినిపించుకోరు. వారిని లెక్కజేయ్యరు. తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీనుకటుంటారు. తీరా
                   89