పుట:Bible Sametalu 2.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
వచ్చే సహజ లక్షణాలు. నల్ల జాఅతివారు ఎంత ప్రయత్నం చెసినా వారి రంగును మార్చుకోలేరు.
"పుట్తుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోద" ని మరొక తెలుగు సామెత. ఎంత ప్రయత్నం చెసినా పుట్టుకతో వచ్చిన సహజ స్వభావాన్ని మానవులు మార్చుకోలేరు. అయితే ఇది ఒక్క దైవానికే సాధ్యమని బైబులు వక్కాణిస్తున్నది. సునకాన్ని తెచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టెనా , దానికి రజనం గానీ, ఠీవి, హుందాతనంగానీ రావు సరికాదా, తన సహజ గుణాన్ని మార్చుకోలేదు. అంటే "చెప్పు తినెడు కుక్క చెఱకు తీపి యెరుగునా" అన్నత్లు తన సహజత్వం మీరకుండ నడుచుకుంటుంది. "వెల్ల వేసినంత మాత్రాన వెన్నెల కాదు" అంటారు కొందరు. గోడలకు సునంకొట్టినంత మాత్రాన వెన్నెల కాస్తుందని, సృష్టి ప్రకాసిస్తుందని భావించడం ఎంత పొరపాటో , కాకి కోకిలౌతుందని, వతలు పెట్టుకొని నక్కపులిగా మారుతుందని భావించడం అంతే పొరపాటు.


యిర్మీయా గ్రంధంలో పని పేర్కొన్న బైబులు సామెత ఉన్నది. కీడు చెయుటకు అలవాటు పడిన జనాంగం, మేలు చేయలేదని, పులి తన మచ్చలను, నల్లవాడు తన దేహచ్చాయను మార్చుకోలేనట్లే దుష్టులు తమ దుష్టత్వం నుండి బయటపడలేరనీ ఈ సూక్తి అతరార్ధం.
" ఎంత ప్రయత్నించినా ఉల్లి మల్లి కాదు" అనే మరొక సామెత దీనికి సమానమైదే.
"బొగ్గు పాల గడుగ బోవునా మలినంబు" అంటాడు వేమన. బొగ్గును తెచ్చి పాలలో కడిగినా దాని నలుపు పోయి తెలుపు రాదు. అలాగే ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడు గాని హీనుడు తన అవగుణాన్ని మానుకోలేడు.


తెలుగు సామెత : కూర్చున్న కొమ్మను నరుకుకొన్నట్లు (పట్టుగొమ్మను నరుకుకొన్నట్టు)

బైబులు సామెతలు : మూఢురాలు తన చేతితో తన యిల్లు ఊడబెరుకును (సామెతలు 14:1)