పుట:Bible Sametalu 2.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

Yayoshiva

   జీవితకాలమంతా పాతకాలు మూటగట్టుకొన్న వాడు మరణశయ్యపై ఉన్నాడట. అవసాన థశలో వాడిచేత ఒక్కసారి నారాయణా అనిపించాలని శ్రేయోభిలాషులు ప్రయత్నిన్తున్నారు. 'నారా' అనమంటే ఏదో అన్నాడట వాడు. 'యణా' అనమంటే ఇంకేదో అన్నాడట. కొందరికి ఏదీ ముక్కుసూటిగా అర్థం చేనుకోవడం అనడం చేతగాదు. అలాటివారు తపోధనుని డాంబికునిగానూ, శుచిగలవానిని వేషధారిగాను, శూరుని కర్కతునిగాను, ప్రియభాషణం చేనేవాడిని దీనునిగానూ నభ'లో యుక్తి యుక్తంగా మాట్లాడేవానిని వదరుబోతుగాను అభివర్ణిస్తారు.
   నీరు పల్లంవైపు ప్రవాహాంగా పారుతుంది. ఇలా ప్రకృతి సహజమైన ఎత్తుపల్లాల్లో వంపులతో నదీనదాలు ప్రవహీన్తుంటాయి. తెలుగు సామెత ఈ ప్రకృతి నత్యం నుండి పుట్టింది. ఆ ఏటి వంకలను నరిజేయడం ఎవరి తరమూ కాదు. ఇక కుక్కతోక సామెతెలియనిదెవరికి?
   కొన్ని చెట్టు కాండాలు ప్రకాండాలు వంపు తిరిగి ఉంటాయి. అవి విరగనైనా విరుగుతాయి గానీ తిన్ననివి కానేరవు. ప్రకృతిసిద్దంగా వక్రబుద్ధి గల కుటిలుడు ఎంత చదివినా నాగరికత నేర్చినా అతని బుద్ధి మారదని ఈ సామెతల భావం.
          3

తెలుగు సామెత : కాకిని తెచ్చి పంజరంలో ఉంచితే చిలుక పలుకుతూందా బైబులు సామెత : కుషు దేశన్తుడు (నల్ల జాతివాడు) తన చర్మమును మార్చుకొన గలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? (యిర్మీయా 13:23) సహాజ గుణాలను, శారీరక వర్ణాన్నీ, తత్త్వాన్నీ మార్చడం సాధ్యపడదని తెలియజేయడానికి ఈ సామెతలు వాడతారు. ఇదే అర్థాన్ని తెలిపే నానుడులు తెలుగు భాషలో చాలా ఉన్నాయి. ఎలుక తోలు తెచ్చి ఎందాక రుద్దినా నలుపు నలుపు గాని తెలుపు రాదు అంటాడు ప్రజాకవి వేమన. కాకి కోకిల కాదు వెలయాలు ఇల్లాలు కాదు అంటారు విజ్ఞులు. కోకిల గుడ్లు పెడితే కాకి వాటిని పొదిగి పిల్లలు చేన్తుందని, కాకీ కోకిలా ఒకే గూటిలో పెరిగినా, ఆకారం నల్లగా ఉన్నా కంరంవం విప్పితే కాకి కూతలు, కోకిల గీతాలు వేరువేరుగా ఉంటాయని ఒక కథనం. కాకికి కోకిల కంరంవంలోని మాధుర్యం రాదు. ఇవి మారని గుణాలు. ప్రకృతి సిద్ధంగా పుట్టుకతో

            86