పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె సచ్ఛీలాన్ని ఏ తక్కెడతోను తూయలేం
ఆకాశాన ఉదయభానుడు ప్రకాశించినట్లే
మంచి యిల్లాలు తాను చక్కగా
తీర్చిదిద్దుకొన్న యింటిలో వెలుగొందుతుంది
పవిత్ర దీపస్తంభంమీద దీపం వెలిగినట్లే
సుందరమైన తనువుమీద ఆమె మొగం ప్రకాశిస్తుంది
వెండి దిమ్మలమీద నిల్చిన బంగారు స్తంభాల్లాగే
బలమైన మడమలమీద ఆమె అందమైన కాళ్లు
వేలుగొందుతుంటాయి
నాయనా! దేశంలో సారవంతమైన క్షేత్రాన్ని వేదకి
దానిలో నీ సొంత బీజాలను వెదజల్లు
నీ మంచి విత్తనాలను నీవు నమ్మాలి
అప్పడు నీ బిడ్డలు మంచి కుటుంబంలో పుట్టామని
విశ్వసించి పెరిగి పెద్దవారై వృద్ధిలోకి వస్తారు - సీరా 26,1-4, 13-21.

సామెతల గ్రంథం 31, 10-31 ఆదర్శ గృహిణిని అతి మనోజ్ఞంగా వర్ణిస్తుంది. పాఠకులు ఈ భాగాన్నంతటినీ చదవాలి. స్థలాభావంవల్ల ఇక్కడ కొన్ని వాక్యాలు మాత్రమే ఉదాహరిస్తున్నాం.

యోగ్యురాలైన గృహిణి యొక్కడ దొరుకుతుంది?
ఆమె పగడాలకంటె విలువైంది
ఆమె పెనిమిటి ఆమెను విశ్వసిస్తాడు
ఆమెవలన అతనికి చాల లాభం కలుగుతుంది
ఆమె జీవించినంతకాలం అతనికి మంచినేగాని
చెడును తలపెట్టదు
ఆమె పెనిమిటి సభలో పెద్దవారిమధ్య కూర్చుండి
ఎల్లరి మన్నన పొందుతాడు
తళుకుబెళుకులు నమ్మరానివి, అందం నిల్చేదికాదు.
ప్రభువుపట్ల భయభక్తులుకల మహిళ మెచ్చుకోదగింది.
ఇంతవరకు గుణవతియైన భార్యనుగూర్చి వివరించాం. ఇక, దుషురాలైన భార్యకూడ వుంది. ఆమె "పెనిమిటిని ధిక్కరిస్తుంది.