పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైతు పొలందున్ని విత్తనాలు నాటినట్లే
నీవూ విజ్ఞానార్జన కొరకు కృషిచేయి
అప్పుడు నీకు చక్కని పంట లభిస్తుంది
నీవు విజ్ఞల బోధలను అనాదరం చేయవద్దు
 వారి సూక్తులను జాగ్రత్తగా పఠించు
వాని వలన నాగరికత అలవర్చుకొని
రాజులకు సేవలుచేసే విధానం నేర్చుకొంటావు - సీరా 6, 18-19, 8,8

విజ్ఞానానికి వెలకట్టలేం. విజ్ఞానవాక్కే సుభూషణం. దానివల్ల మన భవిష్యత్తు బంగారుబాటు ఔతుంది.

బంగారంకంటె విజ్ఞానాన్ని ఆర్థించడం మెరుగు
 వెండికంటె వివేకాన్ని బడయడం మేలు
సముద్రంవలె అగాధమూ, పారేయేరులా నిర్మలమై
 నరుని పల్ములు విజ్ఞాన సంభరితాలై వుంటాయి
 బంగారమంది ముత్యాలున్నాయి
 కాని విజ్ఞానవాక్కేసుభూషణం
 కుమారా! తేనెను భుజిస్తే తీయగా వుంటుంది,
 మధుకోశంనుండి చిప్పిలే తేనే నాల్మకు రుచించినట్లే
 విజ్ఞానం హృదయానికి ఇంపుగా వుంటుంది
 దాన్ని పొందితే నీ భవిష్యత్తు బంగారుబాట ఔతుంది
 - సామె 16,16. 18.4,20.15. 24,13-14

జ్ఞానం ఇంత విలువైంది కనుక భక్తులు దీన్ని గాఢంగా వాంఛించారు. సొలోమోను దీనికొరకు ప్రభువుని ప్రార్ధించాడు.

ప్రభూ! నీ సింహాసనం కుడిప్రక్కనకూర్చుండివుండే
జ్ఞానాన్ని నాకు దయచేయి
నన్ను నీ తనయుల్లో ఒకనిగా స్వీకరించు
పరమ పవిత్రమైన మోక్షపదంనుండి,
మహిమాన్వితమైన నీ సింహాసనం నుండి
జ్ఞానాన్ని నా యొద్దకు పంపు
అది నాతోగలసి పనిచేయునుగాక