పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేదలపట్ల మర్యాదగా మెలగాలి కూడ

పేదలు విన్నవించుకొనే సంగతులు విని

వారికి మర్యాదగా బదులు చెప్పు - 4,8

తోబీతుకూడ తన కుమారుణ్ణి ఈలా హెచ్చరించాడు. "ఆకలిగొన్నవారికి అన్నంపెట్టు. బట్టలు లేనివారికి బట్టలీయి. నీకు సమృద్ధిగా వున్న ప్రతి వస్తువు నుండి కొంత భాగం దానంగా ఈయి. ఇచ్చేదాన్ని ప్రీతితో ఈయి" - 4,16.

దేవునికి కానుకలు అర్పించేపుడు గూడ సంతోషంగాను, ఉదారంగాను ఈయాలి.

ప్రభువుకి ఉదారంగా కానుకలీయి

నీ తొలిఫలాలను అర్పించడంలో పిసినారివి కావద్దు

చిరునవ్వుతో నీ కానుకలు అర్పించు

సంతోషంగా నీ దశమభాగాన్ని ఈయి

మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవూ అతని కీయి

నీ శక్తికొలది ఉదారంగా ఈయి

తనకిచ్చేవారిని ప్రభువు బహూకరిస్తాడు

అతడు నీకు పదిరెట్ల అదనంగా యిస్తాడు - 35, 9–11

5. సాంఘిక న్యాయం

పూర్వవేదం బోధించే గొప్ప ధర్మాల్లో సాంఘిక న్యాయం ఒకటి. అనగా పేదసాదలకు న్యాయం జరిగించడం. ఈ పట్టున సీరా గ్రంథం ఈలా చెప్తుంది.

నీవు పీడకుని బారినుండి పీడితుని విడిపించు

నీవు తీర్చే తీర్పులలో ఖండితంగా వుండు - 4,19

.

పేదలకు అన్యాయంచేసి దేవునికి బలులర్పిస్తే అతడాబలులను స్వీకరింపడు. దరిద్రులకు అన్యాయంచేసి వారి నోటికాడి కూడు పడగొట్టకూడదు.

అన్యాయార్జితమైన పశువును బలిగా అర్పిస్

ఆ బలి దోషపూరితమైన దౌతుంది

దుష్టుల బలిని దేవుడు అంగీకరించడు

మహోన్నతుడు ధుర్మారుల బలివలన సంతుష్టిచెందడు

పెక్కు బలులు అర్పించడం వలన