పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు వాగ్దానం చేసికూడ సాయం చేయరు. ఆలాంటివాళ్ళు ఏలా వుంటారు?
నరుడు వాగ్గానం చేసికూడ వస్తువులనీయకపోతే
మబ్బు గాలి ఆర్భాటం చేసికూడ
వాన కురవనట్లుగా వుంటుంది - సామె 25, 14
రోగులను పరామర్శించి వారికి ఊరట వాక్యాలు చెప్పాలి.
శోకతప్తులకు సానుభూతి చూపు
బాధార్తుల బాధల్లో పాలుపంచుకో
వ్యాధిగ్రస్తులను పరామర్శించడంలో అశ్రద్ధ చూపకు
ఆలాంటి సత్కార్యాలద్వారా
ప్రజల మన్నన పొందుతావు
ఒకదినం నీవూ మరణించి తీరుతావని
నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో
అప్పడు నీవు ఏనాడూ పాపం చేయవు - 7,34-85

మననుండి దానం పొందేవాళ్లు పేదలు, అనాథులు, వితంతువులు. వీళ్ళంటే ప్రభువుకి ఎంతో జాలి

ప్రభువు పేదలకు అన్యాయం చేయడు
బాధితులు మొర అశ్రద్ధ చేయడు
అనాథుని ప్రార్థనను అనాదరం చేయడు
వితంతువు వేడికోలును పెడచెవిని బెట్టడు
వితంతువు నేత్రాలవెంట కారే కన్నీళ్ళు
ఆమెను పీడించినవానిమీద నేరంతెచ్చి
దేవునికి మొరపెడతాయి - సీరా 35, 13-15
నరుడు కటువుగా గాక మృదువుగా మాట్లాడుతూ దానం చేయాలి.
మంచు కురిసినప్పడు వేడిమి సమసిపోతుంది
నీవిచ్చే వస్తువుకంటెగూడ నీ మాటలు ముఖ్యం
కరుణగల వాక్యాలు ప్రశస్తదానంకంటె శ్రేష్టమైనవి
కాని ఉదార స్వభావుడు ఆ రెండిటినీ యిస్తాడు
మూర్ఖుడు ఏమీయాయక వచ్చిన వారిని అవమానిస్తాడు
అనిష్టంగా ఇచ్చినదాన్ని ఎవడు ప్రీతితో జూస్తాడు? - 18, 16-17