పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది బలమైన డాలుకంటె, బరువైన ఈటెకంటె
అధికంగా నీ శత్రువులతో పోరాడి నిన్ను రక్షిస్తుంది - సీరా 29, 8-13
ఆపదలో తోబుట్టువులు సహాయులు
చెంతవుంటే బాగుంటుంది
కాని దానధర్మాలు చేయడంవలన సిద్ధించే సహాయం
అంతకంటె శ్రేష్టమైంది - 40, 24
ధర్మమార్గంలో డబ్బు కూడబెట్టి దానం చేసేవాడి సంపదలు స్థిరంగా నిలుస్తాయి
పాపమార్గంలో డబ్బు కూడబెట్టనివాడూ
నిర్దోషి ఐన ధనికుడు ధన్యుడు
ఆలాంటివాడు దొరికితే అతన్ని అభినందించాలి
అతడు ధనికులెవ్వరూ చేయని అద్భుతం చేసాడు
ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కంగా గర్వించవచ్చు
పాపం చేయగలిగీ చేయనివాడు,
పరుని మోసగింపగలిగీ మోసగింపనివాడు
ఎవడైనా వుంటాడా?
ఆలాంటివాడు ఎవడైనా వుంటే
అతని సంపదలు స్థిరముగా నిల్చునుగాక
జనులెల్లరూ అతని మంచితనాన్ని సన్నుతింతురుగాక - 31, 8-11
ఇంకా, దానంవల్ల మన పాపాలు కూడ పరిహారమౌతాయి
నీళ్ళ మంటను చల్లారుస్తాయి
దానధర్మాలు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాయి - 8,30

ఈ సందర్భంలో తోబీతు గ్రంథంకూడ "దానం మీ పాపాలనెల్ల కడిగివేస్తుంది. మీరు దీర్గాయుష్మంతులౌతారు" అని చెప్తుంది - 12,9

తోడివాడు అక్కరలో వున్నపుడు అతనికి బదులీయలి
తోడివాడు అక్కరలో వున్నపుడు కరుణతో అరువీయి
పొరుగువాడికి సాయపడినపుడు
ప్రభువు ఆజ్ఞలు పాటించినట్లే
తోడివాడు అవసరంలో వున్నపుడు సాయం చేయి
నీవు బాకీపడి వున్నపుడు వెంటనే ఋణం తీర్చు - సీరా 29, 1-2 .

                    62